తెలంగాణ

కార్మికుల్లారా.. శెభాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: సీఎం కేసీఆర్ బెదిరింపులను లెక్కచేయకుండా సమ్మెను కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతల ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ కార్మికులకు డెడ్‌లైన్ పెట్టినా, హక్కుల కోసం సమ్మెను కొనసాగించడం నిజంగా సాహసమేనన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, పోలీసులు కార్మికులను భయాందోళనలకు గురి చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చూపిన ధైర్యాన్ని హక్కుల సాధన కోసం ప్రదర్శిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులు చాలీ చాలని వేతనాలతో ఉన్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో సీఎం చెలగాటమాడుతున్నారన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికులకు సీఎం మూల్యం చెల్లించకతప్పదనాన్నారు. సీఎం రాష్ట్రానికి తండ్రి లాంటి వాళ్లన్నారు. కార్మికులను పిలిచి మాట్లాడాలని ఆయన సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు.