తెలంగాణ

కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ప్రజలు ఇచ్చిన మ్యాండేట్‌తో ప్రజారంజక పాలన అందించకుండా నియంతృత్వ విధానాలతో పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా అన్నారు. బుధవారం ఇక్కడ గాంధీభవన్‌లో పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలో 8వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట మోదీ, కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లో బ్రహ్మాండమైనర్యాలీని నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ మొదటి వారంలో మోదీ ప్రభుత్వ దివాలా కోరు ఆర్థక విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహిస్తామన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ వైఖరితో ప్రజలు విసిగి చెంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో సచివాలయాన్ని కూల్చాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తిరోగమన చర్య అన్నారు. సచివాలయం భవనాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని, కాని కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో వీటిని ధ్వంసం చేస్తారని ఆయన నిలదీశారు. కేంద్రంలో ప్రధాని మోదీ కూడా ప్రజాస్వామ్యానికి ప్రతీగా నిలిచిన పార్లమెంటులో నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. పార్లమెంటు విలువలను కూల్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై జవాబుదారీతనంలేకుండా కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి సినీనటుడు హృతిక్ రోషన్ సినిమా కలెక్షన్లతో పోల్చి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడడం దారుణమన్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో రైతులకు ఇంతవరకు రైతు బంధు స్కీం కింద నిధులు ఇవ్వలేదన్నారు. ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను ఆయన ఖండించారు. ఎఐసీసీ సీనియర్ నేత హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా దిగజారిందన్నారు. ఆర్థిక ఎమర్జన్సీని ప్రకటించాలన్నారు. మన దేశం కంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి రేటు వెంటిలేటర్‌పై ఉందన్నారు. మోదీ పాలసీలన్నీ సామాన్య వ్యక్తికి వ్యతిరేకమన్నారు. పారిశ్రామికాభివృద్ధిరేటు భారీగా పడిపోయిందన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను జనంలోకి తీసుకెళ్లేందుకు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామన్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్‌కుమార్, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు కె జానారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్, కోదండరెడ్డి, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ నేత హెచ్‌కే పాటిల్