తెలంగాణ

కార్మికులు బెదరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ఆర్టీసీ సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి మూడు మార్లు డెడ్‌లైన్లు పెట్టి బెదిరించినా, రెచ్చగొట్టినా కార్మికులు ఎవరూ బెదరలేదని, ఎవరూ తమ విధుల్లో చేరలేదనీ.. దీంతో ముఖ్యమంత్రి కెసీఆర్ నైతికంగా ఓటమి చెందారని, తక్షణమే కేసీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె, మరో పక్క రానున్న మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు, ఇంకో పక్క సంస్థాగత ఎన్నికలు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం బుధవారం నాడు కోలాహలంగా మారింది. ఆర్టీసీ జాక్ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సహా ఇతర నేతలు వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌తో పాటు ఇతర నేతలను కలిసి నవంబర్ 9వ తేదీన జరిగే మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దానికి పార్టీ తరఫున భేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు లక్ష్మణ్ హామీ ఇచ్చారు. మందకృష్ణ మాదిగ ఇతర నేతలు వచ్చి ఆర్టీసీ సమ్మె సహా పలు అంశాలపై లక్ష్మణ్‌తో చర్చించారు. అనంతరం లక్ష్మణ్ పాత్రికేయులతో మాట్లాడారు.
ఆర్టీసీ సమ్మె వల్ల రాష్ట్రంలో భయానక సంక్షోభం కొనసాగుతోందని అన్నారు. 50వేల మంది ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల కేవలం ఆర్టీసీ ఉద్యోగులకే అది పరిమితం కాలేదని, ప్రజాజీవనం మొత్తం స్తంభించిపోయిందని అన్నారు. స్కూళ్లకు వెళ్లేవారు, ఆఫీసులకు వెళ్లేవారు, అనారోగ్యంతో నగరాల్లోని ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమ్మె పరిష్కరించే చిత్తశుద్ధితో ప్రభుత్వం లేదని అన్నారు. కార్మికులను రెచ్చగొట్టినా, భయభ్రాంతులకు గురిచేసినా, భయపెట్టినా 32 రోజులుగా జరుగుతున్న సమ్మె అపురూపమైనదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆర్టీసీ కార్మికులు ఇంతకాలం సమ్మె చేయలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మూడు మార్లు డెడ్‌లైన్లు పెట్టినా కనీసం 300 మంది కూడా ఉద్యోగాల్లో చేరకుండా తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నారని, ముఖ్యమంత్రి పిలుపును వారు ఖాతరు చేయలేదని అన్నారు, ముఖ్యమంత్రి తాటాకుచప్పుళ్లను కార్మికులు పట్టించుకోలేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇది కార్మికుల నైతిక విజయమని, ముఖ్యమంత్రి ఓటమికి చిహ్నమని అన్నారు. సీఎం భేషజాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించి ఉంటే సమ్మె జరిగేది కాదని అన్నారు.
రాష్ట్రంలో సమ్మె అనంతర పరిస్థితులు, పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు, హోం మంత్రి అమిత్‌షాకు వివరించామని అన్నారు. ప్రభుత్వం కార్మికుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని లక్ష్మణ్ కోరారు. సమ్మెకు కేసీఆర్ బాధ్యత వహించాలని, ఆయన రెచ్చగొట్టే మాటల వల్లనే ఇంత వరకూ వచ్చిందని అన్నారు. చర్చలే పరిష్కారమని హైకోర్టు సూచించినా, ఆర్టీసీ ఆస్తులపై కనే్నయడం తప్ప సీఎం సమ్మె పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, జీ వివేక్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు సభ్యులతో కమిటీ
ఆర్టీసీ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ, పార్టీ విధానాన్ని ఖరారు చేసేందుకు జితేందర్‌రెడ్డి, జీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిలతో ఒక కమిటీని నియమించినట్టు లక్ష్మణ్ తెలిపారు.
ఉద్యమ స్ఫూర్తికి జేజేలు: మందకృష్ణ మాదిగ
ధృడసంకల్పంతో సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యమ స్ఫూర్తికి జేజేలు పలుకుతున్నట్టు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ సమ్మె మొదలైన నాటి నుండి సీఎం మూడు హెచ్చరికలు చేసినా కార్మికులు లెక్క చేయలేదని అన్నారు. పేద ప్రజల కోసం ఆర్టీసీని కాపాడుకోవల్సి ఉందని అన్నారు. తెలంగాణ ఆర్టీసీలో 31 శాతం వాటా కేంద్రానికి ఉందని, ఏపీ ఆర్టీసీలోనూ కేంద్రం వాటా ఉన్నా , ప్రభుత్వంలో విలీనం చేసినపుడు తెలంగాణలో వచ్చిన ఆటంకం ఏమిటని ప్రశ్నించారు. ఒక కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేస్తే మిగిలిన కార్పొరేషన్లు అడుగుతాయని సీఎం మితండ వాదం చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ ఇదే ప్రశ్న కేంద్రం అడిగిందని, ఒక రాష్ట్రం విభజనకు అడిగితే మిగిలిన వారూ అడుగుతారని అంటే ఆనాడు కేసీఆర్ ఏం చెప్పారని ప్రశ్నించారు. పోలీసులు ఆర్టీసీ సమ్మె సమయంలో అతిగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. కోదండరాం, అశ్వత్థామ రెడ్డి