తెలంగాణ

జాతీయ స్థాయిలో రాణిస్తున్న తెలంగాణ క్రీడాకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకరించడంతో రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి ఎంతో పేరుప్రతిష్టలు తేస్తున్నారని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. లాల్‌బహదూర్ స్టేడియంలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) కార్యాలయంలో రెండోసారి చైర్మన్‌గా ఆల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. సాట్స్ చైర్మన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, సాట్స్ చైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులకు విద్యా, ఉద్యోగాలలో మంచి ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గత మూడు సంవత్సరాలలో శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఎంతో నిబద్ధతో, క్రమశిక్షణతో నిర్వహించారని అదే విధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్పోర్ట్స్ చైర్మన్‌గా రెండోసారి తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన సీఎం కేసీఆర్, క్రీడా శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్‌ను అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం, క్రీడాశాఖ మంత్రి ప్రోత్సాహంతో త్వరలో క్రీడలలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చైర్మన్ ఋశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, అంతర్జాతీయ బాక్సర్ నిజాముద్దీన్, అంతర్జాతీయ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి బుద్ద అరుణా రెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలు, సాట్స్ వీసీ, ఎండీ ఎ.దినకర్ బాబు పాల్గొన్నారు.