తెలంగాణ

భూకుంభకోణంలో టీఆర్‌ఎస్ నేతలపై ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: తహసీల్దార్ విజయారెడ్డి హత్య బాధాకరమని, ఆ ప్రాంతంలోని భూకుంభకోణాలకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్ నేతలపైనే ఆరోపణలు వస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని చెప్పారు. విజయారెడ్డి హత్య వెనుక పెద్ద వ్యవస్థీకృత కుట్ర ఉందని, విజయారెడ్డి అంతిమయాత్రలో రెవిన్యూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని , లోగుట్టు ఏమిటో బయటకు రావాలని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబళీఐ ఎంక్వైరీ చేయాలని, బీజేపీ రాష్ట్ర శాఖ నుండి సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నామని అన్నారు. అనేక వ్యవస్థలను , సంస్థలను కేసీఆర్ భ్రస్టుపట్టించారని, మియాపూర్ భూకుంభకోణంలో అప్పటి డిప్యుటీ సీఎం పేరు బయటకు వచ్చిన పార్టీ నేతల పేర్లు బయటకు వచ్చినా, కేవలం అధికారులను మాత్రమే బదిలీ చేసి చేతులుదులుపుకున్నారని అన్నారు. ఉద్యోగులపై గతంలో అవినీతి అధికారులను చెప్పుతో కొట్టాలని కేసీఆర్, కేటీఆర్‌లు పిలుపునిచ్చారని, లక్షలాది మంది రైతులు భూ రికార్డులు ప్రక్షాళన పేరుతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు పీఆర్సీని 2012 జూలై 1 నుండి వర్తింపచేస్తూ వెంటనే ప్రకటించాలని స్టేట్ రిటైర్డ్ టీచర్సు ఎంప్లాయిస్ ఆఫ్ బీజేపీ సెల్ చైర్మన్ బీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెన్షనర్లకు , ఉద్యోగులకు హెల్త్ స్కీమ్‌లను అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలుచేయాలని, 70 ఏళ్లు పూర్తయిన పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలుచేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయులకు తెలంగాణ ఇనె్సంటివ్ ప్రకటించాలని, ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి సీఎం ముందుకు రావాలని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని , 9వ తేదీన ఆర్టీసీ కార్మికులు నిర్వహించ తలపెట్టిన ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని దానిని విజయవంతం చేయాలని కోరారు. గురువారం నాడు రిటైర్డ్ టీచర్ల , ఉద్యోగుల సదస్సు భేటీ జరిగింది.