తెలంగాణ

ఈత మొక్కలు నాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ఈ వర్షాకాలంలో హరిత హారంలో భాగంగా 55లక్షల ఈత, తాటి మొక్కలను నాటనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు తెలిపారు. ఈనెల 23న ఎక్సైజ్ ప్లాంటేషన్ డేగా పాటిస్తూ ఈత, తాటి మొక్కలను నాటనున్నట్టు చెప్పారు. పద్మారావు సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తొమ్మిది జిల్లాల్లోనూ ఈ మొక్కలు నాటుతారు. ఒక్కో జిల్లాలో ఒక్కోక్కరుగా ఇన్‌చార్జ్‌గా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి పద్మారావు, నల్లగొండలో ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, రంగారెడ్డి జిల్లాలో కమీషనర్ చంద్రవదన్, ఆదిలాబాద్ జిల్లాలో అడిషనల్ కమీషనర్ ప్రసాద్, ఖమ్మం జిల్లాలో హైదరాబాద్ డిప్యూటీ కమీషనర్ వివేకానందరెడ్డి, వరంగల్‌లో డిఎఫ్‌ఓ వేణుమాధవ్, మహబూబ్‌నగర్‌లో కమీషనర్ ఓఎస్‌డి ఫారూఖ్‌లకు ఆయా జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతలు అప్పగించారు. వచ్చే సంవత్సరం రెండు కోట్ల ఈత, తాటి మొక్కలను నాటనున్నట్టు మంత్రి తెలిపారు.