తెలంగాణ

ప్రతిభ ఆధారంగానే విసిల ఎంపిక యుజిసి నామినీ వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో వైస్ చాన్సలర్ల నియామకాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, సిఎం కార్యాలయం నుండి ఎలాంటి ఆదేశాలు తమకు రావడం లేదని, కేవలం మెరిట్ ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని సెర్చ్ కమిటీలో యుజిసి పరిశీలకుడిగా హాజరైన ఒక ప్రొఫెసర్ వెల్లడించారు. ఒక యూనివర్శిటి సెర్చ్ కమిటీ సమావేశానికి హాజరైన యుజిసి నామిని ఒకరు ప్రభుత్వ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ 65 ఏళ్ల లోపు పదేళ్ల ప్రొఫెసర్ అనుభవం ఉన్న అభ్యర్ధుల జాబితాలను ముందుంచారు, దానిలో మెరిట్ ప్రకారం స్క్రూటినీ చేయడం జరిగింది, ఒక దశలో ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ వైపు చూసినా ఆమె ఏం మాట్లాడలేదు, ఎలాంటి ప్రతిపాదనలు తమ వైపు నుండి లేవని, మెరిట్ ప్రకారం ఎంపిక జరగాలని కోరుకుంటున్నట్టు ఆమె సంకేతాలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాల్లో విసిల ఎంపికకు హాజరైన తాను ఆయా రాష్ట్రాల ప్రతిపాదిత పేర్లను ప్రత్యేకించి పరిశీలించడం జరుగుతుంది, కాని పూర్తి మెరిట్‌పై విసిల ఎంపిక జరగాలని కోరుకోవడం తొలిసారి చూస్తున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు.