తెలంగాణ

తెలంగాణ నీటి అవసరాలు చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ ప్రజల సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక నీటి అవసరాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఈ నెల 11 న దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే సమావేశం జరుగుతుండటంతో ఈ సమావేశం ఏర్పాట్లు తదిరత అంశాలపై కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కోటి ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండీ తదితర నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టిందని, ఈ వివరాలు కేంద్రానికి సమర్పించే నివేదికలో పొందుపరచాలని కోరారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్రం ఉదారంగా సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్ల నుండి కోరుతోందని, అయినప్పటికీ కేంద్రం నుండి అవసరమైన సాయం అందడం లేదని గుర్తుచేయాలని సూచించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటిటీ తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశామని, మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలోని 45 వేల చెరువులు, కుంటల పునర్నిర్మాణ పనులు చేపట్టామని గుర్తు చేయాలన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగానికి సంబంధించి సమీప రాష్ట్రాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్నామని, వివాదాలు లేకుండా చూస్తున్నామని గుర్తు చేయాలన్నారు. కృష్ణా, గోదావరి జలాలు ఏటా పెద్ద ఎత్తున వృథా అవుతున్నాయని, ఈ నీటిని వినియోగించుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు సాగునీటిని, తాగునీటిని ఇచ్చేందుకు వీలవుతుందని, ఇందుకోసం బృహత్ పథకం రూపొందించి అమలు చేయాల్సి ఉందని, ఈ విషయాన్ని కూడా 11 న జరిగే సమావేశంలో కేంద్రానికి స్పష్టంగా తెలియచేయాలని కేసీఆర్ సూచించారు. నీటి వినియోగంపై స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియచేస్తూ, నివేదిక రూపొందించాలని, ఎవరికీ హాని జరగకూడదన్నదే మన ఉద్దేశంగా స్పష్టం చేయాలన్నారు.
ఆర్టీసీపై చర్చ
ఆర్టీసీ కార్మికుల సమ్మె, హైకోర్టులో జరుగుతున్న విచారణపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 11 న హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ ఉన్నందు వల్ల విధానపరమైన నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. ప్రభుత్వ వైఖరిని హైకోర్టుకు స్పష్టం చేయాలని సీఎం సూచించినట్టు తెలిసింది.