తెలంగాణ

చలో ట్యాంక్‌బండ్ రణరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ట్యాంక్‌బండ్ ప్రాంతం రణరంగమైంది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణ యుద్ధవాతారణం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, నిరసనలు, అరుపులు, కేకలతో చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం హోరెత్తిపోయింది. ఆందోళనకారుల కవ్వింపు చర్యలు, పోలీస్ లాఠీ చార్జి మధ్య ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ట్యాంక్‌బండ్ వైపు ఎవరూ వెళ్లకుండా, అన్ని మార్గాల్లోనూ పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు ఆందోళనకారుల్ని నిలువరించలేకపోయాయి. వాటిని ఛేదించుకుంటూ ముందుకు దూసుకెళ్లిన వారిని పోలీసులు బలవంతగా వాహనాల్లోకి ఎక్కించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడంతో, దెబ్బలు తగిలి, రక్తం కారుతున్నప్పటికీ ఆందోళనకారులు పట్టువదకుండా ట్యాంక్‌బండ్ వైపు దూసుకుపోయారు. ప్రభుత్వ నిర్భందాలు తప్పించుకుని ట్యాంక్‌బండ్ వైపుచొచ్చుకుని రావడానికి విశ్వప్రయత్నాలు చేశారు. పోలీసులు ముందస్తుగా జేఏసీ నేతలను అరెస్టు చేసినప్పటికీ, కార్మికులు మాత్రం చలోట్యాంక్‌బండ్‌కు తరలి రావడం విశేషం. శనివారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సకలజనుల సామూహిక దీక్షను విఫలం చేయడానకి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీక్షకు మద్దతుగా ఆర్టీసీ జెఏసీ, విపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన వచ్చింది. వేల సంఖ్యలో తరలి వచ్చిన ఆందోళనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. బారీకేడ్లును ఛేదించుకుంటూ కార్మికులు ముందుకు దూసుకెళ్లగా, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులు, పోలీసుల మధ్య తొక్కిసలాట జరిగింది. పలువురు కార్మికులకు గాయాలు తగిలాయి. అడ్డంకులను తొలగించుకొని ట్యాంక్‌బండ్ వైపు దూసుకుపొతున్న ఆందోళన కారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. కొంత మంది తలలు పగిలి రక్తం చిందించింది. ఇది చూసి ఆగ్రహించిన మిగతా కార్మికులు అక్కడ ఉన్న పోలీసులపై రాళ్ళు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, కార్మికులను చెదరగొట్టడానికి ర్యాపిడ్ యాక్సన్ ఫోర్స్ దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. అయినా, కార్మికులు వెనక్కితగ్గకుండా రాళ్లు రువ్వారు. వీరి దాడిలో కొందరు పోలీసుకు గాయాలు తగిలాయి. పోలీసులను రెచ్చగొడుతూ ఆందోళనకారులు కవ్వింపు చర్యలకు దిగారు. పరోక్షంగా వారికి సవాళ్లు విసిరారు. దీంతో ఆందోళనకారులను తరమడానికి పోలీసులు ప్రయత్నించారు. బీఆర్‌కే భవన్ వైపు నుంచి వందలాది మంది కార్మికులు పోలీసుల వైపు దూసుకువచ్చారు. బారీకేడ్లను పక్కకు లాగుతూ ట్యాంక్‌బండ్ వైపు పరుగులు తీశారు. వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. తొక్కిసలాటలో కిందపడ్డ కార్మికులను ఈడ్చుకుంటూ పోలీసులు వాహనాల్లోకి ఎక్కించారు. కాగా, రాణిగంజ్ నుంచి బుద్ధ్భవన్ వైపు వస్తున్న కార్మికులను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రత్నాలు విఫలమయ్యాయి. కాగా, లిబర్టీ, దోమలగూడ తదితర మార్గాల నుంచి, ట్యాంక్‌బండ్ వైపు పరుగులు తీస్తున్న కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. వీరిని బీఆర్‌కే భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ వారి మధ్య తోపులాట జరిగింది. అక్కడ కూడా కార్మికులను చెదరగొట్టడానికి లాఠీచార్జి చేయగా, అందుకు ప్రతీకారంలో వారు రాళ్లురువ్వారు. దోమలగూడ వైపు నుంచి వస్తున్న కార్మికులను తరిమేందుకు ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ వాహనాల్లో పోలీసులు వారి వెంటపడ్డారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగిస్తూ కార్మికులను చెల్లాచెదురు చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ఉద్దేశంతో పోలీసులు ట్యాంక్‌బండ్ వైపు రావడానికి అన్నివైపులా దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోనే బారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. కాగా, ట్యాంక్‌బండ్ వైపు రాకుండా పోలీసులు ఏర్పాటు చేసిన మూడంచల వ్యవస్థతో నగర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలతో ఎక్కడికి వెళ్ళినా బారీకేడ్ల అడ్డంగా ఉండడంతో నగరవాసులు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు.