తెలంగాణ

నేడు మంత్రుల ఇళ్ల వద్ద కార్మికుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి పెంచడానికి మంత్రుల నివాసాల వద్ద నిరసనలు చేపట్టాలని జేఏసీ, అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. నిరవధిక సమ్మెను మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై హైదరాబాద్‌లో ఆదివారం అఖిలపక్ష నేతలతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, టీడీపీ, తెలంగాణ జనసమతి అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ భేటీలో సమ్మె తదుపరి కార్యాచరణ ప్రణాళికపై దాదాపు 3 గంటల పాటు చర్చించారు. చర్చల అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శనివారం చలో ట్యాంక్‌బండ్ విజయవంతమైందన్నారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో మావోయిస్టులు పాల్గొన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పడం సమంజసం
కాదన్నారు. ఆర్టీసీ జేఏసీ కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్య ఉందని ఆయన ఆక్షేపించారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి మావోయిస్టులు వచ్చారని ఆపాదించవద్దని ఆయన హితవు పలికారు. అదేవిధంగా ఆర్టీసీ సమ్మెను కార్మికులమంతా కలసి ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని, ఇలాంటి సమయంలో ఇందులోకి మావోయిస్టులను లాగవద్దని ఆయన అన్నారు. కాగా, చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మిక కుటుంబాలు భారీగా కదలివచ్చారన్నారు. మహిళా కార్మికులు చూపించిన ధైర్యాన్ని అందరూ మెచ్చుకునే విధంగా ఉందన్నారు. కార్మికులపై పోలీసులు జరిపిన దమనకాండను ఆయన తీవ్ర ఖండించారు. కాగా, సోమవారం హైదరాబాద్‌లో మంత్రుల నివాసాల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. 13.14 తేదీల్లో ఢిల్లీలో జేఎసీ ఆధ్వర్యంలో మానవహక్కుల కమిషన్‌తోపాటు జాతీయ మహిళా కమిషన్‌తో భేటీ అవుతున్నట్లు చెప్పారు. సోమవారం ధర్నా చౌక్ వద్ద నలుగురు జేఏసీ కోకన్వీనర్లు రిలే దీక్షలో పాల్గొంటారని ఆయన గుర్తు చేశారు. ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా సడక్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆయన చెప్పారు. సమ్మె ప్రారంభమై ఆదివారం నాటికి 37 రోజులు గడిచిపోయాయన్నారు. అఖిలపక్ష భేటీలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, సంపత్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ మోహనరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
*చిత్రం...ఆర్టీసీ జేఏసీ ఈయూ కార్యాలయంలో ఆదివారం వివిధ రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి