తెలంగాణ

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ‘సిరిపురం’ విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: సూర్యాపేట జిల్లా మట్టపల్లి వాస్తవ్యుడు సిరిపురం విశ్వనాధం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ.50 లక్షలు విరాళాన్ని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు అందజేశారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దులలో ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న సైనికుల కోసం చిరు వ్యాపారి అయిన విశ్వనాధం ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలను తన జీవిత కాలంలో కూడబెట్టిన మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. సైనిక సంక్షేమ శాఖ ద్వారా గవర్నర్‌ను కలిసి రూ.50 లక్షల చెక్కును సాయుధ దశాల పతాక దినోత్సవ నిధికి (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్)కి తెలంగాణ రాష్ట్ర సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి చైర్మన్ అయిన గవర్నర్‌కి చెక్న్ అందజేశారు. ఈ సందర్భంగా సిరిపురం విశ్వనాధం మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి సైనికుల కోసం కొంత విరాళం ఇవ్వాలని అనుకున్నానని ఇప్పటికి ఆ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని, సైనికులు మన కోసం ఎంతో సేవ చేస్తారని వారి కోసం విరాళం ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నానని గవర్నర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ మాజీ సైనికుల కోసం, సైన్యంలో పనిచేసి వీర మరణం పొందిన వారి కోసం, యుద్ధంలో గాయపడిన, వారి కుటుంబాల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఒకే వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా తాను దాచుకున్న సొమ్ము నుండి దానం చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. దేశం కోసం పోరాడే సైనికుల కోసం విరాళం ఇవ్వడమంటే దేశ సేవ చేయడమేనని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజలు అందరూ ఇదే విధంగా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి భూరి విరాళాలు ఇవ్వాలని కోరారు. దేశ భక్తిని చాటుకున్న సిరిపురం విశ్వనాధంను గవర్నర్ హృదయ పూర్వకంగా అభినందించి శాలువాతో సత్కరించారు.
*చిత్రం...గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు విరాళం అందజేస్తున్న సిరిపురం విశ్వనాథం