తెలంగాణ

30న రెవెన్యూ ఉద్యోగుల ‘సింహగర్జన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని ఆరోపిస్తూ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. రెవెన్యూ జేఏసీ నేత వి. లచ్చిరెడ్డి అధ్యక్షతన సోమవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ ప్రణాళికను ఖరారు చేసి మీడియాకు విడుదల చేశారు. ఈ నెల 13 న ఉద్యోగులంతా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ 14న ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. 15 న అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో వంటా-వార్పు కార్యక్రమం చేస్తారు. 16 న భూసంబంధిత విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. 16 నుండి 22 వరకు ప్రాంతీయ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. 16న ఖమ్మంలో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పూర్వపు జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తారు. 19న కామారెడ్డిలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పూర్వపు జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. 22న హైదరాబాద్‌లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తారు. 30న ‘సింహగర్జన’ పేరుతో హైదరాబాద్‌లో రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ ఉద్యోగులు పజల వద్దకు వెళ్లి పనిచేయలేని పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందని జేఏసీ నేత లచ్చిరెడ్డి ఆరోపించారు. 58 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినప్పటికీ, రెవెన్యూ ఉద్యోగులను దోషులుగా ప్రజలకు ప్రభుత్వం చూపిస్తోందని ఆరోపించారు. రైతులతో పాటు ఇతరులు రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తున్నారని తెలిపారు. అన్ని భూసమ్యలకు ఉద్యోగులే కారణమని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాస్తవంగా చట్టాల్లో ఉన్న గందరగోళం, సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడ్డ లోపాలు, ఉద్యోగుల కొరత తదితరాలన్నీ సమస్యలకు కారణమన్నారు. రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేసేందుకు ఒక పథకం ప్రకారం ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ చేపడుతున్న ఆందోళనకు సహకరిస్తామని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్. రాములు, ఎస్‌టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి జి. సదానందగౌడ్ విద్యుత్ జేఏసీ నేత మేడి రమేష్, టీజీ టీటీఏ ప్రధాన కార్యదర్శి విజయకుమార్, ఆర్టీసీ జేఏసీ నేతలు థామస్‌రెడ్డి, రాజిరెడ్డి టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ. రఘునందన్, ఎస్‌టీఎఫ్ టీఎస్ అధ్యక్షుడు పోచయ్య, టీఎస్ పీటీఏ ప్రధాన కార్యదర్శి ఎన్. చిన్నరాములు, టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎస్‌టీయూ టీఎస్ అధ్యక్షుడు ఎం. పర్వతరెడ్డి, రెవెన్యూ జేఏసీ నేతలు ఎస్. రాములు, గరికె ఉపేందర్‌రావు, ఎన్. లక్ష్మీనారాయణ, వంగూరు రాములు, సుధాకర్‌వు, బి. సుదర్శన్ తదితరులు మాట్లాడారు.