తెలంగాణ

ధ్యానంతో భగవంతునికి చేరువ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: మానవులంతా ఒక్కటేనని, ధ్యానం ద్వారానే భగవంతునికి చేరువ కావాలని గురునానక్ ప్రబోధించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఇక్కడ మంగళవారం జరిగిన గురుపర్వ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన గురునానక్ చిత్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. అన్ని ధర్మాలను గౌరవించాలని, ఎవరినీ శారీరకంగా, మానసికంగా హింసించరాదని, ఆహారాన్ని అందరితో పంచుకుని తినాలని, నిజాయితీగా సంపాదించాలని, ధ్యానం ద్వారానే భగవంతునికి చేరువ కావాలని నానక్ ప్రభోదించారని
అన్నారు. నానక్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు రీజనల్ అవుట్‌రీచ్ బ్యూరోను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా గురుసింగ్ సభా అధ్యక్షుడు గురుచరన్ సింగ్ బగ్గా మాట్లాడుతూ మానవులంతా ఒక్కటేనని గురునానక్ బోధించారని అన్నారు. ఆయన బోధనలు దేశానికి మార్గదర్శకమని అన్నారు. కష్టించి పనిచేయాలని, వందనం చేయాలని, నామం జపించాలని గురునానక్ పేర్కొన్నారని, అవసరం ఉన్న వారికి ఎపుడూ సాయం చేయాలని, ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకోవాలని అన్నారు. గురుసింగ్ సభ ఉపాధ్యక్షుడు అమృత్‌సర్ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ సభ్యుడు సజ్జన్ సింగ్ మాట్లాడుతూ పవన్ (గాలి), గురు (దేవుడు), పానీ (నీరు) సీతా, మాతా ధాతి అని గుర్తించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. గురుభేజ్ సింగ్, హరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

*చిత్రం... ప్రసార శాఖ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గురునానక్ చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి