తెలంగాణ

ఆదివాసీల సంస్కృతిని కొనసాగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ఆదివాసీ జీవితాలకు, కళా సాంస్కృతిక రంగానికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ‘ఆదిధ్వని’ సంస్థ సేకరించిన 124 సంగీత పరికరాల ప్రదర్శనను గవర్నర్ మంగళవారం సందర్శించారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేకంగా సంగీత వాద్యాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రతి సంగీత పరికరాన్ని తమిళిసై పరిశీలించి, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివాసీలు ఉపయోగించిన సంగీత పరికరాలను, గానరీతులు, రాగాలు, సంగీత వాద్యాలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంగీత పరికరాలపై దృష్టి కేంద్రీకరించి ఆదివాసీల సంస్కృతిని, వారసత్వ సంపదను కాపాడాల్సి ఉందని, ఈ విషయంతో తన వంతు చేయూత ఇస్తానని
హామీ ఇచ్చారు. వైవిద్యభరితమైన దేశీయ సంగీతాన్ని కాపాడుకోకపోతే అవి కాలగర్భంలో కలిసిపోతాయన్నారు. ‘ఆదిధ్వని’ సంస్థ సేకరించిన వందలాది సంగీత పరికరాలను ప్రదర్శన శాలలో ఉంచేందుకు చేయూత ఇస్తానని హామీ ఇచ్చారు. ఆదిధ్వని నిర్వాహకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి మ్యూజియం స్థాపించేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రుంజ, తోటి బుర్రవాద్యం, కిక్రీ, కోయడోలు కళాకారలులను సన్మానించారు. ఆచార్య గూడూరు మనోజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిధ్వని సంగీత పరికరాలను సేకరించిన ఆచార్య జయధీర్ తిరుమల రావు, పొట్లపల్లి వరప్రసాదరావు, డాక్టర్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్