తెలంగాణ

మిషన్ భగీరథే స్కాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: మిషన్ భగీరథ పెద్ద కుంభకోణమని రాష్ట్ర బీజేపీ నేతలు ఒకవైపు ఆరోపణలు చేస్తుండగా, ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర జల వననరులశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని శాసనసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే దేశవ్యాప్తంగా కుంభకోణాన్ని విస్తరించేటట్టుగా ఉందని భట్టి విమర్శించారు. శాసనసభ కమిటీ హాల్‌లో మంగళవారం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ఒకవైపు రాష్ట్ర బీజేపీ నేతలు అవినీతి పథకమని ఆరోపణలు చేస్తుండగా మరోవైపు అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా అమలు చేస్తామనడం చూస్తే టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య ఏమైనా ఒప్పందం కుదిరిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో రూ. 50 వేల కుంభకోణం జరిగిందని దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్కామ్‌లకు పాల్పడేందుకే స్కీమ్‌లు తెస్తున్నారని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో ఎక్కడా తహిశీల్దార్‌ను కార్యాలయంలోనే సజీవ దహనం చేసిన ఉదంతం జరగలేదని భట్టి అన్నారు. ఈ ఉదంతంపై రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడేందుకు ప్రభుత్వానికి సమయం లేదు కానీ, మిషన్ భగీరథపై మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి సమయం ఉందా? అని భట్టి మండిపడ్డారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ కార్యాలయంలోనే ప్రజల నుంచి తమకు రక్షణ కావాలని కోరుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఆందోళన కలిగిస్తుందని అన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టులపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.
ఆత్మహత్యలు లేని తెలంగాణ అనే్లదా? విహెచ్ ధ్వజం
తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఉండవని అప్పట్లో సీఎం కేసీఆర్ చెప్పారని, మరి ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు మండిపడ్డారు. గాంధీభవన్‌లో మంగళవారం విహెచ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ తీరుతో ఆర్టీసీ సమ్మె ఉధృతం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. రైతులకు హక్కులున్నా పట్టా పత్రాలు అందక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని విహెచ్ విమర్శించారు.