తెలంగాణ

డైట్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ జూలై 16: విద్యాబోధన నేర్పించే ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో డైట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఒక యువకుడు మన స్తాపానికి గురై చెట్టు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా ఖేడ్ మండలం తుర్కాపల్లి గ్రామ పంచాయతీలోగల గిరిజన తండాల్లో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన కుటుంబీకులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తుర్కాపల్లి గ్రామం గిరిజన తండాకు చెందిన రవికుమార్ (20) ఝరాసంఘం శ్రీ సంగమేశ్వర్ డైట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదుతున్నాడు. కళాశాల ప్రిన్సిపాల్ శుక్రవారం తోటి విద్యార్థుల ముందు తన చేతిలో ఉన్న ఫోన్‌ను తీసుకుని అవమానించారని మనస్తాపానికి గురయ్యాడు. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసుకుని శనివారం తెల్లవారుజామున తుర్కాపల్లి గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూములో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో రాసుకున్నాడు. తన మరణానికి కళాశాల ప్రిన్సిపాలేనని కారణమని, అందులో పేర్కొన్నాడు. మృతుడి కుటుంబీకులు శనివారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విద్యార్థి మృతదేహాన్ని పంచనామా నిర్వహించిన అనంతరం ఖేడ్ ఆసుపత్రిలో పోస్టుమాస్టం నిర్వహించి, అతని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్‌ఐ రఘునందన్ విలేఖరులకు తెలిపారు.