తెలంగాణ

‘మల్లన్న’ను నిర్మించాలనుకుంటే చస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండపాక, జూలై 16: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పంట పొలాలు, నివాసాలు విడిచిపెట్టి పోవాలంటే చచ్చేంత బాధ కలుగుతోందని మెదక్ జిల్లా తొగుట మండలంలోని ఎర్రవల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. శనివారం కొండపాక మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో మల్లన్నసాగర్ నిర్మాణం వద్ద గ్రామానికి చెందిన ఆరె బాలమ్మ, అల్లం లావణ్య క్రిమిసంహారక పురుగుల మందు డబ్బా పట్టుకొని తాగే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం ఉపసంహరించుకోకుంటే చావే శరణ్యమంటూ సమావేశంలో తీర్మానం చేశారు. గ్రామంలో మహిళలపై కేసులు పెట్టారని తెలిసిందని, ఎవరిపై ఎందుకు కేసులు పెట్టారని, తమ గ్రామానికి డిసిఎం వాహనం ఎందుకు తీసుకువచ్చారని సిఐ, ఎస్‌ఐలతో గంట సేపు వాగ్వాదం జరిగింది. ఎంపిటిసి గ్రామస్థులకు అండగా ఉండాల్సిందిపోయి ప్రభుత్వంకు అండగా ఉండడం ఏమిటని వారు నిలదీశారు. తమ భూములు, ఊరును ఖాళీ చేయిస్తే తమకు మరణమే శరణ్యమంటూ గ్రామానికి చెందిన బాలమ్మ ఊరంతా ఏడుస్తూ తిరిగారు.