తెలంగాణ

చురుగ్గా ప్రమాద నివారణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 16: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని పివికె-5 ఇంక్లైన్ భూగర్భగని వద్ద బోర్‌వెల్ వేసే ప్రక్రియను అధికారులు శనివారం ప్రారంభించారు. భూపాలపల్లి, సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన రెండు బోర్‌వెల్ రిగ్‌లతో పనులను మొదలుపెట్టారు. గని ఉపరితలం నుండి బోర్‌పాయింట్ వేసి సుమారు 250 నుండి 350 మీటర్ల లోతున గని ప్రమాదం సంభవించిన ప్రదేశం వరకు డ్రిల్ వేసిన తరువాత ఐరన్ పైపులు అమర్చి వాటిద్వారా కార్బన్‌డయాక్సైడ్‌ను పంపిస్తారు. ఇది చేరిన అనంతరం గని నుండి శాంపిల్ తీసి పరీక్షిస్తారు. తరువాత పరిస్థితిని బట్టి రెస్క్యూటీంను గనిలోకి పంపిస్తారు. సీల్ వాల్స్‌ను ఎక్కడెక్కడ నిర్మించాలో నిర్ణయించి తరువాత లోపల వాల్ పనులను ప్రారంభిస్తారు. డ్రిలింగ్ పనులు చేస్తున్న సందర్భంలో కార్బన్ మోనాక్సైడ్ తదితర విష వాయువులు వెలువడినా ప్రమాదం జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.