తెలంగాణ

గిరిజన విద్యార్థులకు హరిత హారం బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: హరిత హారం కార్యక్రమంలో గిరిజన విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేయాలని గిరిజన అభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అధికారులను ఆదేశించారు. పచ్చదనంలో ప్రథమ స్థానంలో నిలిచే విద్యా సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఒక ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా హరిత హారంలో పాల్గొనాలని సూచించారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అప్పగించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గిరిజన విద్యా సంస్థల్లో, కార్యాలయాల్లోనూ మొక్కలు నాటాలని సూచించారు. విద్యార్థులకు పచ్చదనం ఆవశ్యకతను వివరిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పారు. ఆకస్మికంగా తనిఖీ చేసి మొక్కలు నాటిన విద్యా సంస్థలకు అక్కడికక్కడే ప్రోత్సాహకాలు ప్రకటించనున్నట్టు చెప్పారు. హరిత హారంలో గిరిజన విద్యా సంస్థలను పచ్చదనంగా మారిస్తే, సంబంధిత ఉపాధ్యాయులకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ లక్ష్మణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా తీజ్ పండుగ
సంప్రదాయ తీజ్ పండుగ బంజారాల సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అజ్మీరా చందూలాల్ తెలిపారు. తీజ్ పండుగలో భాగంగా ఆగస్టు ఏడవ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో బంజారా కీర్తి పురస్కార్ 2016ను నిర్వహించనున్నట్టు తెలిపారు. కీర్తి పురస్కార్ వాల్ పోస్టర్‌ను చందూలాల్ ఆవిష్కరించారు.