తెలంగాణ

ఆగిన మెట్రో రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: ప్రతిరోజు లక్షలాది మంది నగరవాసులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న మెట్రోరైలు మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయింది. నాగోల్ నుంచి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే రైలు సరిగ్గా రాత్రి ఏడు గంటలకు అమీర్‌పేట స్టేషన్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 1449కు చేరుకోగానే, ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో ఆగిపోయింది. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు ఏమి జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. అమీర్‌పేట స్టేషన్ వద్ద ఇనుప రాడ్ కింద పడింది.
అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. మెట్రోరైలు కారిడార్‌లో షార్ట్‌సర్క్యూట్ సంభవించటంతోనే రైలు ఒక్కసారిగా ఆగిపోయినట్లు సిబ్బంది గుర్తించి రంగంలోకి దిగి గంట వ్యవధిలో మరమ్మతు చేపట్టి సేవలను పునరుద్ధరించారు. సాంకేతిక లోపంతో నాగోల్ నుంచి మెట్రో స్టేషన్ల మధ్య సింగిల్ లేన్‌లో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.