తెలంగాణ

రెండేళ్లలో మెదక్ రైల్వేలైన్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూలై 16: రెండేళ్లలో పట్టాల నిర్మాణ పనులు పూర్తిచేసి మెదక్‌కు రైలు వచ్చేలా చేస్తామని భారీ నీటిపారుదల, శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం మెదక్ మండలం పాతూర్ సమీపంలో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులకు డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీష్‌రావు భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదిక నుండి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 60 సంవత్సరాల మెదక్ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటి రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టారన్నారు. గతానికి భిన్నంగా పూర్తిస్థాయిలో భూమి కొనుగోలు చేసి ఇవ్వడంతోపాటు బడ్జెట్‌లో నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. భూమి కొనుగోలుకు 35 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఇప్పటివరకు 2830 ఎకరాలు భూమి సేకరణ పూర్తయిందని, మిగతా అటవీ భూమిని కూడా తీసుకుంటామన్నారు. 17.2 కిలోమీటర్ల లైన్ ఏర్పాటుకు సుమారు 120 కోట్ల బడ్జెట్ అంచనాలు వేయగా 60 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా 11 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. మెదక్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్‌కున్న ప్రేమకు నిదర్శనమన్నారు. రైల్వే పని ఆగకుండా ముందుగానే డబ్బులు జమచేస్తామన్నారు.

చిత్రం.. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు