తెలంగాణ

ఇక టిఆర్‌ఎస్‌కు చెడ్డ రోజులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 16: ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఓ ఐరన్ లెగ్ అని, పదవుల కోసం మూడు పార్టీలు మారిన ఆయనను సిఎం కెసిఆర్ టిఆర్‌ఎస్‌లోకి చేర్చుకుని పెద్ద రాజకీయ పొరపాటు చేశారని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. శనివారం నల్లగొండలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుత్తాపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎంపిగా గుత్తా పోటీ చేసినందునే 2009, 2014 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు పరిధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారంటూ గుత్తా చెప్పుకోవడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌గా వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 2004 ఎన్నికల్లో త చేతిలో ఓడిన గుత్తా తదుపరి ఎన్నికల్లో తననే గెలిపించానంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నల్లగొండ ఉపఎన్నికతోనే టిఆర్‌ఎస్‌కు చెడ్డ రోజులు, కాంగ్రెస్‌కు మంచి రోజులు రాబోతున్నాయని ఈ ఎన్నికల్లో తెలంగాణలోనే అత్యధికంగా 6 లక్షల మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించడమే తన లక్ష్యమన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి