తెలంగాణ

తక్షణ నిర్ణయం తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ఆర్టీసీ కార్మికల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం నిర్ణయం తీసుకోవాలని, వారిని వెంటనే విధుల్లోకి అనుమతించాలని జెఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. సమ్మె విరమించడానికి జెఏసీ సుముఖంగా ఉందని స్పష్టం చేసినప్పటికీ, సీఎం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కార్మికుల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన సీఎంకు హితవు పలికారు. కార్మికులను విధుల్లో చేర్చుకునే అంశంపై సీఎం నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం హైదరాబాద్ మహాత్మాగాంధీ
బస్టాండ్‌లో అన్ని కార్మిక సంఘాల నేతలు భేటీ అయ్యారు. సీఎం వ్యవహార శైలిపై వారంతా అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కార్మిక సంఘాల నేతల భేటీ అనంతరం అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ షరతులు లేకుండా విధుల్లోకి చేరతామని తాము సూచించినా సీఎం మొండి వైఖరి అవలంభించడం దుర్మార్గమని అన్నారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ పరం చేసే అధికారం ఎవరీకీ లేదని ఆయన ఓకప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైకోర్టు తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పిన సీఎం మూడు రోజులు గడిచినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
భయాందోళనలు...
సమ్మె విరమిస్తామని చెప్పినప్పటికీ, ఇంత వరకూ సీఎం సానుకూల ప్రకటన చేయకపోవడంతో కార్మికుల్లో భయాందోళనలు క్షణక్షణానికీ పెరుగుతున్నాయి. తమను విధుల్లోకి తీసుకునేలా సీఎంపై వత్తిడి తీసుకురావడానికి శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఉద్రిక్తత నెలకొంది. బస్ డిపోల నుంచి బస్‌లను బయటికి తీసుకురాకుండా కార్మికులు ఉదయానే్న అడ్డుకున్నారు. వారిని అడ్డుతొలగించడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరుపక్షాల మధ్య తోపులాటలు జరిగాయి. పోలీస్ చర్యులను నిరసిస్తూ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించి, విధుల్లో చేర్చుకోవడానికి సీఎం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బచావో అంటూ కార్మికులు నినాదాలు చేశారు. ర్యాలీల్లో కొంత మంది కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రదర్శనల్లో అసాంఘిక శక్తులు చేరే ప్రమాదం ఉందన్న సమాచారం రావడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను అధికారులు మోహరింప చేశారు.

*చిత్రం... . హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్‌లో శనివారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులతో కలిసి ధర్నా చేస్తున్న జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి