తెలంగాణ

పథకాల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: పశువులు, గొర్రెల పెంపకం, సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వ చేపట్టిన పథకాలు, కార్యక్రమాల అమలులో ఉన్నతస్థాయి నుండి కింది స్థాయి వరకు సిబ్బంది శ్రద్దతో పనిచేయాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హెచ్చరించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో ఉన్నతాధికారులు, జిల్లాల పశువైద్యాధికారులతో శనివారం మంత్రి సమావేశం నిర్వహించారు. డైరెక్టరేట్ భవనంలో కొత్తగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జిల్లాస్థాయి అధికారులు తమ కార్యాలయాలకే పరిమితం కాకూడదని, వారంలో రెండురోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. బడుగువర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు పాడిగేదెల పంపిణీ, గొర్రెల పంపిణీ చేపట్టామన్నారు. పాడిగేదెలు, గొర్రెల పంపిణీ తర్వాత లబ్దిదారులు ఏ విధంగా వాటిని ఉపయోగించుకుంటున్నారో పర్యవేక్షిస్తుండాలని సూచించారు. గొల్ల, కురుమలకు ఐదువేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెల పంపిణీ చేశామని, లబ్దిదారుల వద్ద గొర్రెలు ఉన్నాయా లేదా అన్న విషయంపై సర్వే చేయాలని సూచించారు. గొర్రెల పెంపకం ద్వారా గొల్ల, కురుమలకు ఉపాధి లభించాలని, వారి ఆదాయం పరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. జీవాలకు వైద్యం అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. జీవాలకు సకాలంలో వ్యాక్సిన్‌లు వేయాలని, లేకపోతే అవి చనిపోతాయన్నారు. 1300 మంది గోపాలమిత్రలు, పశువైద్య సిబ్బంది పనిచేస్తున్నందువల్ల కృత్రిమ గర్భదారణ విజయవంతంగా కొనసాగించాలన్నారు.
పాల ఉత్పత్తిపెంచేందుకే పాడిగేదెల పంపిణీ చేశామని, వీటి పంపిణీ తర్వాత కూడా పాల ఉత్పత్తి పెరగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు. పట్టణాల్లోని పశువైద్యశాలలు నిరుపయోగంగా ఉంటే వాటిని అవసరమైన గ్రామాలకు తరలించాలని సూచించారు. గొర్రెలు, పాడిగేదెలు కొనుగోలు సమయంలో ఇన్సూరెన్స్ ప్రక్రియ సక్రమంగా ఉండేలా చూడాలని, ఒకవేళ అవి మరణిస్తే, బీమా డబ్బు చెల్లించేందుకు వీలవుతుందున్నారు. ఇన్సూరెన్స్ క్లెయింల బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంటుందన్నారు. గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలకు ఎన్నికలు జరిపేందుకు అవసమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పుడున్న మందులతో పాటు కొత్త మందులను సరఫరా చేసేందుకు ముగ్గురు అధికారులతో ఒక కమిటీ వేస్తామని మంత్రి శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్‌ఎల్‌డీఏ సీఈఓ మంజువాణి, విజయడెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, జిల్లాల పశువైద్య అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో శనివారం అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్