తెలంగాణ

అధికారం కోసం శివసేన కక్కుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహారాష్టల్రో శివసేన అధికారం కోసం కక్కుర్తి పడిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన రాజధానిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక సీట్లు సాంపాదించినా బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని, శివసేన కలిసి వస్తే ప్రభుత్వం ఏర్పాటుచేయాలని చూస్తే అందుకు శివసేన కలిసి రాలేదని అన్నారు. తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన ఇతర పార్టీలతో చేతులు కలపాలని చూసిందని అన్నారు. మహారాష్టల్రో జరిగిన ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏకు మహారాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారని, 165 సీట్లు ఇచ్చారని, శివసేననూ గెలిపిస్తే అప్రజాస్వామికంగా, అనైతికంగా, కాంగ్రెస్ పార్టీతో కలిసి చేతులుకలపాలని కక్కుర్తికి పాల్పడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పును గౌరవించి బీజేపీ అధికారం చేపట్టిందని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన శివసేనకు ఇది బుద్ధి చెప్పడమేనని చెప్పారు. 30వ తేదీ వరకూ బలం నిరూపించుకునే గడువుందని అన్నారు.
ప్రశాంత్‌పై అనే్వషణ
హైదరాబాద్ యువకుడు ప్రశాంత్ పాకిస్తాన్‌లో అరెస్టయిన వార్తలపై అనే్వషణ మొదలైందని కిషన్‌రెడ్డి చెప్పారు. భారత విదేశాంగశాఖ రాయబారితో మాట్లాడటం జరిగిందని, అక్కడి ప్రభుత్వంతో సంప్రదించి ఆ యువకుడ్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రశాంత్‌ను విడిపించడానికి భారత్ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
ఆర్టీసీ సమ్మె రాష్ట్ర అంశం
ఆర్టీసీ సమ్మె పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై స్పందించాలని కిషన్‌రెడ్డి చెప్పారు. మన తెలంగాణ బిడ్డలేనని, పేద మధ్యతరగతి వారే పనిచేస్తున్నారు కనుక వారిని దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా మానవతాదృక్పథంతో ఆలోచించాలని అన్నారు. పేద కార్మికులను ఆదుకోవాలని కేంద్రం కూడా కోరుతోందని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ఎంతో కష్టనష్టాలకు గురవుతూ ఉద్యోగాలు చేస్తుంటారని, వారి పిఎఫ్, జీతాలు వెంటనే చెల్లించి, వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కిషన్‌రెడ్డి సీఎంను కోరారు. కాగా అంతకుముందు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పాత్రికేయులతో మాట్లాడుతూ లౌకికపార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సైద్ధాంతికంగా దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా లౌకికవాదమనే ముసుగువేసుకుందని అన్నారు.