తెలంగాణ

ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే చార్జీలు పెరుగుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే చార్జీలు పెరుగుతాయని, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీపీసీసీ ధ్వజమెత్తింది. శనివారం ఇక్కడ టీపీసీసీ ప్రతినిధి సతీష్ మాదిగ విలేఖర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియంతృత్వ చర్యల వల్ల రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లను తగ్గించాలని, చాలా చోట్ల మూసివేయాలనే నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజల జీవన స్థితి అధ్వాన్నంగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు 4500 ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారన్నారు. టీచర్ ఉద్యోగాలను కావాలని భర్తీ చేయడం లేదన్నారు. ఆర్టీసీని వైద్యం, విద్యను ప్రైవేట్‌పరం చేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేసీఆర్ చర్యలను నిరసిస్తూ ఉద్యమించాలన్నారు. రాష్ట్రం అప్పులు మూడులక్షల కోట్ల రూపాయలు దాటాయన్నారు.
బీజేపీ అనైతికతకు పరాకాష్ట మహారాష్ట్ర: పీసీసీ మాజీ చీఫ్ పొన్నం
బీజేపీ అనైతికతకు పరాకాష్ట మహారాష్ట్ర అంశమని పీసీసీ మాజీ చీఫ్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల మనుసులు గెలవాలని, అక్రమంగా పదవులు కాదన్నారు. కాంగ్రెస్ మహారాష్టల్రో అధికారంలోకి వస్తాయని చెప్పలేదన్నారు. సోనియాగాంధీ ప్రతిపక్షంలోనే ఉంటామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ సర్జికల్ స్ట్రైక్‌లు అప్రజాస్వామికమన్నారు. చీకటి రాజకీయాలకు నిలుపుటద్దమన్నారు. రాజభవన్, రాష్టప్రతి భవన్, ప్రధానమంత్రి ఆడిన చీకటి రాజకీయమన్నారు. నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన దినమన్నారు. ఇది చరిత్ర క్షమించని అంశమన్నారు.