తెలంగాణ

అవినీతిపరులకు హెచ్‌సీఏ రెడ్‌కార్పెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: అవినీతిపరులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో రెడ్ కార్పెట్ పరుస్తున్నారని అంబటి రాయుడు చేసిన ట్వీట్‌ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఏకీభవించినట్లు ప్రకటించారు. హెచ్‌సీఏలో అవినీతి పేరుకుపోయిందన్న మాట వాస్తవమేనని నేడిక్కడ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సాట్స్ చైర్మన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ స్టేట్ జట్టులో కేవలం డబ్బులు తీసుకుని క్రీడాకారులను ఎంపిక చేస్తూ గ్రామీణ క్రీడాకారులలో దాగివున్న ప్రతిభను తొక్కిపెడుతున్నారని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం కొందరి వ్యక్తుల చేతుల్లో బందీగా ఉందన్నారు. హెచ్‌సీఏకు అనుబంధంగా రాష్ట్రంలోని 33 జిల్లాలో తక్షణమే క్రికెట్ సంఘాలను ఏర్పాటు చేయాలని, తద్వారా క్రికెట్ కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రికెట్ క్రీడాకారుల ప్రతిభను బయటకు తీసి రంజీ ట్రోఫీకి, భారత క్రికెట్ జట్టుకు ఎంపిక చేసేటట్లు కృషి చేయాలని, ఈ మేరకు హెచ్‌సీఏ తగిన నిర్ణయాలు తీసుకోవాలని వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. హెచ్‌సీఏ పాలకులు ఎవ్వరు కూడా అంబటి రాయుడు ప్రతిభకు సహకరించకుండా.. ఎదగకుండా అడ్డుకున్నారని, అయిన్నప్పటికీ అంబటి రాయుడు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఏలాంటి నైరాశ్యం చెందకుండా తన స్వయంకృషితో భారత జట్టులో స్థానం సంపాదించాడని స్పోర్ట్స్ చైర్మన్ అన్నారు. హెచ్‌సీఏలో నెలకొన్న అవినీతి ఆరోపణలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు జోక్యం చేసుకుని ప్రక్షాళన చేయాలని, వ్యవహరాలను చక్కదిద్దాలని ఆయన కోరారు.
అదే విధంగా అంబటి రాయుడు న్యాయం చేకూర్చి హైదరాబాద్ జట్టులో ఆడేలా కేటీఆర్ కృషి చేయాలన్నారు. హైదరాబాద్ జట్టులో అంబటి రాయుడు తన సత్తచాటి భారత జట్టులో స్థానం సంపాదిస్తాడని వెంకటేశ్వర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.