తెలంగాణ

ఉగ్రవాద ఖైదీలున్న జైళ్లలో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: తెలంగాణలో ఉగ్రవాద ఖైదీలున్న జైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ జైళ్లశాఖను కోరింది. దీంతో చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ జైళ్లలో అధికారులు భద్రతను మరింత పెంచారు. గతంలో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరి విచారణ ముగిసేదాకా వీరిని ఇతర జైలుకు మార్చవద్దని ఎన్‌ఐఏ కోరింది. అదేవిధంగా ఇటీవల పట్టుబడిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులలో రిమాండ్ విధించిన ముగ్గురితోపాటు వివిధ ఉగ్రదాడుల కేసుల్లో నిందితులైన 18 మంది చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న ఇబ్రహీం యజ్దాని సోదరులు సహ పేలుళ్ల కుట్ర సూత్రధారులు నరుూమతుల్లా హుస్సేని, అతావుల్లా రహ్మాన్‌ను గడువు ముగిశాక చంచల్‌గూడ జైలుకు తరలిస్తారు. కాగా ఆయా జైళ్లలోని ఉగ్రవాద ఖైదీలతో ములాఖత్‌కు వచ్చేవారిపై గట్టి నిఘా ఉంచారు. వారి పూర్తి సమాచారం, గుర్తింపు ఆదారాలను కూడా సేకరించి ఎప్పటిప్పుడు నిఘా అధికారులకు అందజేస్తున్నారు. అలాగే వరంగల్ జిల్లా జైల్లో ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాద ఖైదీలను కలిసేందుకు ఇప్పటి వరకు ఎవరూ రాలేదని సమాచారం. ఉగ్రవాద కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారయ్యేదాకా చట్ట ప్రకారం అన్ని సదుపాయాలు వర్తిస్తాయి. అయితే ములాఖత్‌లు మాత్రం జైలు అధికారులు, సిబ్బంది కనుసన్నల్లోనే సాగుతాయని జైళ్ల అధికారి ఒకరు తెలిపారు. ఇక ఐఎస్ హ్యాండర్లతో నేరుగా సంబంధాలు నెరపిన నరుూమతుల్లా హుస్సేని, అతావుల్లా రహ్మాన్‌లతోపాటు డేంజర్ మాడ్యూల్స్‌లోని ఇబ్రహీం యజ్దాని, మహమ్మద్ ఇలియాస్ యజ్దానీలను ఎన్‌ఐఏ ప్రశ్నిస్తోంది. వీరిలో నరుూమతుల్లా, అతావుల్లా నుంచి అత్యంత కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. మరో బృందం యజ్దానీ సోదరులను వేర్వేరుగా రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్టు సమాచారం. ఈ నలుగురి కస్టడీ గడువు వచ్చే బుధవారం ముగియనుండడంతో ఆలోగా ఐఎస్ నెట్‌వర్క్‌కు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నట్టు ఎన్‌ఐఏకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.