తెలంగాణ

ఆలయాల్లో అమావాస్య సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝరాసంగం, నవంబర్ 26: మంగళవారం కార్తీక అమావాస్య కావడంతో ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మండలంలోని వివిధ ఆలయాల్లో తెల్లవారు జాము నుండే భక్తులు దర్శనాల కోసం బారులు తీరారు.దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.. ఈ ఆలయానికి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు కర్నాటక, మహారాష్ట్రాలకు చెందిన భక్తులు ఉదయమే చేరుకున్నారు. ముందుగా ఆలయం వెనుక భాగంలో ఉన్న అమృత గుండంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దైవదర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా నిర్వహకులు క్యూ పద్ధతిన దర్శనాలు గావించారు. గర్బగుడిలోని పార్వతి పరమేశ్వరులకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేకపూజలు చేసిమొక్కులు తీర్చుకున్నారు. అదే విధం గా ఆలయ ఆవరణంలో ఉన్న నవగ్రహాలకు తైలభిషేకం, నల్లవస్త్రాలతో పూజలు చేశారు.
ఈదులపల్లి శివారులో గల శ్రీ రేవణ సిద్దేశ్వరస్వామి ఆలయంలో కార్తీక అమావాస్య సందర్బంగా రుద్రాభిషేకం, శ్రీకేదారేశ్వర వత్రం నిర్వహించారు. ఇందులో ఎంపీటీసీలు శంకుతలమ్మ, శంకర్‌పాటిల్, నాయకులు రాచయ్యస్వామి భక్తులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.