తెలంగాణ

2021 డిసెంబర్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ టనె్నల్ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 26: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఒకటవ టనె్నల్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయం డిసెంబర్ 2021నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇరిగేషన్ అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. టనె్నల్ నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని ఆదేశించారు. మంగళవారం ఆమె నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో ఎలిమినెటి మాధవ రెడ్డి ప్రాజెక్టులో భాగంగా నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ ఒకటవ టనె్నల్ నిర్మాణం పనులను తనిఖీ చేశారు.
ఎస్ ఎల్‌బీసీ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన స్మితా సబర్వాల్‌కు కలెక్టర్ శ్రీ్ధర్, సీఈ నర్సింహతో పాటు ఏజెన్సీ ప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా టనె్నల్ వద్దకు వెళ్లి నిర్మాణం పనులను పరిశీలించారు. సొరంగ మార్గం లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని కిలోమీటర్ల పనిచేస్తున్నారో, ఇతర లైనింగ్ తదితర పనుల గురించి తెలుసుకున్నారు. సొరంగ నిర్మాణ పనులలో భాగంగా సొరంగం నుండి వెలువడిన మట్టి, రాయి, ఇతర పదార్థాల తరలింపు, సీపేజీ వాటర్ బయటకి పంపుతున్న విధానం తదితర వాటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు ఏజెన్సీ జేపీ అసోసియేర్స్ ప్రతినిధులు అనిల్‌కమత్ సొరంగం నిర్మాణ పనులను వివరిస్తూ ఒకటవ టనె్నల్ 43.93కిలోమీటర్లకు గాను కేవలం 10.63 కిలోమీటర్ల పని మాత్రమే మిగిలి ఉందని లైనింగ్ ఇతర పనులను సమాంతరంగా ఏక కాలంలో జరుగుతున్నాయని తెలిపారు. రెండవ టనె్నల్‌కు సంబంధించి లైనింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం ప్రాజెక్టు ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో ఈఎన్‌సీ మురళీధర్, సీఈ నర్సింహ, ఏజెన్సీ ప్రతినిధులు అనిల్‌కమత్, సమీర్‌గోయల్, డీఈ శ్రీనివాస్ తదితరులతో టనె్నల్ నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా అనిల్‌కమత్ ఒకటవ టనె్నల్ నిర్మాణ పనులను మోడల్ టనె్నల్, మ్యాప్‌ల ద్వారా వివరించారు. ప్రతి నెల ఎంత మేర సొరంగ పనులు చేస్తున్నది.. ప్రతి రోజు క్లీనింగ్ పనులు, సొరంగం తవ్వకంలో భాగంగా రాతిక్రషింగ్ తదితర వివరాలను స్మితా సబర్వాల్ అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ఒకటవ టనె్నల్ ప్రపంచంలోనే పొడవైనదని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మాణ పనులను చేపడుతున్నామని, సొరంగం నిర్మాణం పనులలో భాగంగా ఎప్పటికప్పుడు క్లీనింగ్‌తో పాటు లైనింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ సొరంగం నిర్మాణ పనులలో జాప్యం చేయవద్దని, పురోగతిని నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...ఎస్‌ఎల్‌బీసీ పనులను పరిశీలిస్తున్న సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్