తెలంగాణ

చెరువులన్నింటికీ జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి చెర్వు జల కళను సంతరించుకునే విధంగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామ పెద్ద చెర్వు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యాన్ని స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చెర్వులు, కాల్వల నిర్మాణం పేరుతో రైతులను గుడ్డిగా, మూర్ఖంగా మోసం చేశాయన్నారు. గత 40 సంవత్సరాల నుండి రైతాంగానికి సాగునీరు అందడం కలగానే మిగిలిందన్నారు.
చెర్వులు, కాల్వల నిర్మాణం కోసం ఆర్భాటంగా గత ప్రభుత్వాలు సర్వేలు చేయించాయే కానీ ఏ ఒక్క నిర్మాణం జరగలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి నిర్మాణాల కోసం శిలఫలకాలు వేస్తే మరో ముఖ్యమంత్రి శిలా ఫలకాల వెంబడి మొక్కలు నాటారే తప్ప చుక్క నీటినికూడా రైతులకు అందించలేదన్నారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నా పరిష్కారం కాలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనే రైతాంగ సమస్యల పరిష్కారానికి మార్గమనే ఉద్దేశంతో తమ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నీటి కోసం ఎదురు చూపులు చూసే ప్రసక్తే లేదన్నారు. మాధవరం చెర్వును కాళేశ్వరం జలాలతో నింపి రైతాంగ సమస్యలతో పాటు తెలంగాణ ప్రజలకు సాగు, తాగునీటిని అందించడం ఖాయమన్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రతి గ్రామ చివరి భూములకు కాళేశ్వరం జలాలతో నీటిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాధవరం చెర్వును మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. రైతులకు కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శమన్నారు. అనంతరం మండల పరిధిలోని బరాఖత్‌గూడెం గ్రామంలోని చారిత్రాత్మక శ్రీవెంకటేశ్వర ఆలయ ప్రహరీగోడకు మంజూరైన రూ.33 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నల్లపాటి ప్రమీల, పార్టీ మండల అధ్యక్షుడు తొగరు రమేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సుంకరి అజయ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ కె. ఉపేందర్, నాయకులు నల్లపాటి శ్రీనివాస్‌తో పాటు ఆయా గ్రామశాఖల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
*చిత్రం...మాధవరం రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి