తెలంగాణ

మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూర్ గ్రామంలో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్న ప్రియాంకరెడ్డిని అతిదారుణంగా, కిరాతకంగా హత్యచేసిన మహ్మద్ అలియాస్ ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను రిమాండ్‌కు తరలించే విషయంలో శనివారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయ. ఆసలు ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కోర్టుకు తీసుకువస్తున్నామని ప్రచారం జరగగా, మరోవైపు మహబూబ్‌నగర్ కోర్టుకు తీసుకువస్తున్నారని ప్రచారం కావడంతో జడ్చర్ల, మహబూబ్‌నగర్ కోర్టు దగ్గరకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ. అయితే ఇక్కడి పరిస్థితులను గమనించిన పోలీసులు షాద్‌నగర్‌లోనే తహశీల్దార్ ముందు హాజరుపర్చారు. షాద్‌నగర్‌లో పరిస్థితులు చేయిదాటి పోవడంతో పోలీసులే తహశీల్దార్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి అక్కడే రిమాండ్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. మళ్లీ నిందితులను ఏ జైలుకు తరలించాలనే తర్జనభర్జన నెలకొంది. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తీసుకువస్తారని అందరు భావించగా జిల్లా జైలు దగ్గరకు మహబూబ్‌నగర్‌లోని పట్టణ ప్రజలు, మీడియా అక్కడకు కూడా తరలివెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా జైలు
దగ్గరకు వందలాది మంది తరలిరావడం, అంతా హడావిడి నెలకొనడంతో నిందితులను మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తీసుకురాకుండా షాద్‌నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. కాగా ప్రియాంకరెడ్డిని హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. నిందితులకు షాద్‌నగర్‌లో వైద్యపరీక్షల నుండి మొదలుకొని జైలుకు తీసుకెళ్లే వరకు అంతా తర్జనభర్జన, ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. రంగారెడ్డి జిల్లా నుండి మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రియాంకరెడ్డిని హత్యచేసిన నిందితులను తీసుకువస్తున్నట్టు ప్రచారం జరగడంతో మహబూబ్‌నగర్‌లో మాత్రం ప్రజలు, మీడియా హల్‌చల్ సృష్టించింది. అయితే చివరకు చర్లపల్లి జైలుకు నిందితులను తరలించడంతో ఇక్కడ అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ప్రియాంకరెడ్డిని హత్యచేసిన మహ్మద్ అలియాస్ ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు అనే నిందితుల గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జక్లేర్ గ్రామంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రియాంకరెడ్డిని హత్యచేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఉదయం నుండి సాయంత్రం వరకు మహబూబ్‌నగర్‌లో అంతా హల్‌చల్ నెలకొంది
*చిత్రం... నిందితులను మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలిస్తున్నారని ప్రచారం జరగడంతో జైలు దగ్గర గుమిగూడిన జనం