తెలంగాణ

పోలీసుల నిర్లక్ష్యమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య ఘటన కేసులో పోలీసుల నిర్లక్ష్యం, జాప్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంద ని జాతీయ మహిళా కమిషన్ పేర్కొం ది. ఈ సంఘటన జరిగిన వెంటనే ఢిల్లీ నుంచి కమిషన్ సభ్యురాలు ఎస్ శ్యామల కుందర్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ బృందం సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్‌తో కేసు పూర్వ పరాలను చర్చించింది. ఈ నేరంపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నట్లు కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ తెలిపారు. తాము పరిశీలించిన అంశాలను పత్రికలకు విడుదల చేశారు. బాధితురాలి తల్లితండ్రులు రెండు పోలీసు స్టేషన్ల మధ్య ఫిర్యాదు ఇచ్చేందుకు తిరిగారన్నారు. దీని వల్ల కాలాపహరణ జరిగిందన్నారు. పోలీసులు నేరం జరిగిన మర్నాడే దర్యాప్తును చేపట్టారన్నారు.
బాధితురాలి కుటుంబానికి ఎటువంటి రక్షణ కల్పించలేదన్నారు. ఏ పోలీసు స్టేషన్ పరిధిలో నేరం జరిగిందనేదానిపై నిర్థారించేందుకుపోలీసులు తాత్సారం చేశారన్నారు. పోలీసు దర్యా ప్తు బృందంలో మహిళా అధికారి లేరన్నారు. టోల్‌ప్లాజా వద్ద సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు స్పష్టంగా లేవన్నారు. టోల్‌ప్లాజా సమీపంలోనే ఖాళీ ప్రదేశా న్ని మద్యం సేవించేందుకు ఉపయోగించుకుంటున్నారన్నారు. ఈ విషయా న్ని పోలీసులు గమనించకపోవడాన్ని కమిషన్ గర్హించింది. టోల్ ప్లాజా ఏరియాలో పోలీసు పెట్రోలింగ్ లేదన్నా రు. బాధితురాలి కుటుంబాన్ని కూడా జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు కలిశారు. పోలీసులు సకాలంలో స్పందించి రంగంలోకి దిగి ఉంటే, ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదనే అభిప్రాయాన్ని రేఖాశర్మ వ్యక్తం చేశారు.