తెలంగాణ

ఆర్టీసీ కార్మికులతో నేడు సీఎం ఆత్మీయ సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దాదాపు రెండు నెలల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు, కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ద్విముఖ వ్యూహం’ రచించి అమలు చేస్తున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందాన కార్మికుల్లో ప్రభుత్వం పట్ల గౌరవం పెంచడంతో పాటు, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేందుకే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం ‘ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోల నుండి కార్మికులను ఆహ్వానించారు. ఒక్కో డిపో నుండి ఐదుగురు చొప్పున 485 మంది కార్మికులు (డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది) హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి డిపో నుండి వచ్చే ఐదుగురు ప్రతినిధుల్లో తప్పనిసరిగా ఇద్దరు మహిళలు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని డిపోల మేనేజర్లు ఇప్పటికే తమ తమ డిపోల నుండి కార్మికులను ఎంపిక చేసి, సీఎం కార్యాలయానికి సమాచారం అందించారు. ఎంపికైన కార్మికుల ఫొటోలను కూడా పంపించారు. ప్రగతి భవన్‌కు వచ్చే కార్మిక ప్రతినిధులను సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేసి సమావేశ మందిరంలోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. మొత్తం 600 మందికి భోజనం ఏర్పాట్లు జరిగాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు, కార్మికుల సమస్యలను, ప్రభుత్వం నుండి, ఆర్టీసీ యాజమాన్యం నుండి వారు ఆశించే అంశాలపై చర్చలు జరుపుతారు. సమస్యలను సవ్యంగా వినిపించే వారికి అవకాశం ఇచ్చి, వారి నుండి సమాచారం సేకరించేందుకు సీఎం సిద్ధపడ్డారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు కూడా వారి నుండి సలహాలు స్వీకరిస్తారు. ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తారు.
ఆదివారం జరిగే ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ప్రభుత్వపరంగా ఏమేమి అంశాలను ప్రస్తావించాలన్న అంశాలను నిర్ణయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ పాల్గొన్నారు.

*చిత్రం... ముఖ్యమంత్రి కేసీఆర్