తెలంగాణ

నేడు ఏకం కానున్న 165 జంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 30: ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఆదివారం చేయనున్న సామూహిక వివాహాలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సినిమా సెట్టింగ్‌ల మాదిరిగా ప్రత్యేకంగా భారీ మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణతో కూడిన సెట్టింగ్‌లను ఏర్పాటు చేశారు. మిరుమిట్లుగొలిపే విద్యుత్ కాంతుల మధ్య మేలురకం ముత్యాలు కలిపిన తలంబ్రాలతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ్మాస్వామి దేవాలయం నుంచి వచ్చిన వేద పండితులతో పాటు, టీటీడీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేదపండితుల పర్యవేక్షణలో సామూహిక వివాహాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వివాహమహోత్సవానికి మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ.శ్రీనివాస్‌గౌడ్‌లతోపాటు, ప్రభుత్వ విప్‌లు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్యలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నట్టు ఎంజెఆర్ ఛారిటబుల్ ట్రస్టు డైరక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి తెలిపారు. దాదాపు 50 వేల మంది హాజరవుతారనే అంచనాలతో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కార్యక్రమ నిర్వాహకులు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తెలిపారు. కల్యాణ మండపానికి ముందు మైదానం మొత్తం పెండాళ్లతో నీడ వసతి కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించారు. కల్యాణ మహోత్సవం ప్రతి ఒక్కరికీ కనిపించేందుకు వీలుగా భారీ స్క్రిన్‌లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి పరిశీలించడంతో పాటు భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎస్పీ మోహన్‌రెడ్డి, గాంధీనాయక్‌లతో చర్చంచి అందుకు అనుగుణంగా బారికేడ్లను, బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగే సామూహిక వివాహామహోత్సవంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ్మాస్వామి ఉత్సవ మూర్తులకు వివాహాలను నిర్వహించడంతో పాటు భరత, కూచిపూడి కళాకారులతో నృత్యప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.