తెలంగాణ

తెలంగాణ ‘నిర్భయ’ ఘటన దేశంలో అత్యంత హేయం.. ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, నవంబర్ 30: తెలంగాణ ‘నిర్భయ’ ఘటనలో..దేశంలోనే అరుదైన సంఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. వెటర్నరీ డాక్టరు ప్రియాంకరెడ్డిపై అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివలను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అయితే మానవ మృగాళ్లను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అరెస్టు చేసి ఉంచారన్న విషయం తెలుసుకున్న ప్రజలు శనివారం ఉదయం నుండే పెద్ద ఎత్తున చేరుకున్నారు. రానురాను ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు చేరుకుని ప్రియాంక కేసులో నిందితులను తమకు అప్పగించాలంటూ..నినాదాలు చేస్తూ ఆందోళనకు పూనుకున్నారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో సైబరాబాద్ కమీషనరు సజ్జనార్ అదనపు బలగాలను పంపడంతో పాటు శంషాబాద్ డిసిపి ప్రకాష్‌రెడ్డి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మొదట నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటి ఆసుపత్రికి తరలించి ఆతరువాత కోర్టులో హాజరు పరచాలని పోలీసులు భావించారు. అయితే పోలీసుస్టేషన్ బయట వేలాదిగా జనం పోగై ఆందోళనకు పూనుకోవడం..ఆపై చెప్పులతో దాడి చేయడం వంటి సంఘటనలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సోషల్ మీడియాలో కూడా సంఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు ప్రత్యామ్నయ చర్యలకు పూనుకున్నారు. నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుండి కమ్యూనిటి ఆసుపత్రికి వైద్య పరీక్షలకు తరలించే కన్నా డాక్టర్లనే పోలీస్ స్టేషన్‌కు రప్పించి వైద్యపరీక్షలు చేయించారు. ఆతరువాత షాద్‌నగర్‌లో మెజిస్ట్రేటు అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి పరిస్థితుల మధ్య ఏం చేయాలో ఉన్నతాధికారులతో ఆలోచన చేశారు. ఈక్రమంలో షాద్‌నగర్ తహశీల్దారు/మెజిస్ట్రేటు పాండునాయక్‌ను పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడగా తహశీల్దారు/మెజిస్ట్రేటు పాండునాయక్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈసమయంలో పోలీస్ స్టేషన్‌లో మెజిస్ట్రేటు ముందు నిందితులను హాజరుపరచగా 14రోజుల రిమాండ్ విధించారు. పోలీస్ స్టేషన్‌కే మెజిస్ట్రేటు/తహశీల్దారు, వైద్యులు ఒక కేసు విషయంలో రావడం దేశంలోనై అరుదైన సంఘటనగా పేర్కొంటున్నారు.
నిందితులు వాడిన లారీ సీజ్
షాద్‌నగర్ రూరల్: పశువైద్యురాలు డాక్టర్ ప్రియాంక హత్య కేసులో మాన మృగాలు వినియోగించిన లారీని పోలీసులు సీజ్ చేసి షాద్‌నగర్ ఆర్టీసి బస్టాండ్‌లో ఉంచారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి నుండి షాద్‌నగర్ పురపాలక సంఘం చటాన్‌పల్లి వరకు లారీలో ప్రియాంకరెడ్డి మృతదేహం తీసుకువచ్చిన లారీని పోలీసులు స్వాదీన పరుచుకొని బస్టాండ్‌లో ఉంచారు.
*చిత్రం... మానవ మృగాలు వినియోగించిన లారీని సీజ్ చేసిన దృశ్యం