తెలంగాణ

నా కొడుకు అమాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, నవంబర్ 30: తన కొడుకు ఆడపిల్లలాంటి వాడని, వాడు అహంభావంగా ఉన్నప్పటికీ అమాయకుడని, తన కొడుకును అన్ని విధాల చెడిపింది జక్లేర్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అని, తప్పుచేస్తే నలుగురికి ఎలాంటి శిక్ష విధిస్తారో, తన కుమారునికి కూడా అదే శిక్ష విధించండని చింతకుంట చెన్నకేశవులు తల్లి జయమ్మ పేర్కొంది. ప్రియాంక రెడ్డి హత్యచారం కేసులో నిందితుడైన తన కొడుకు చిన్న కేశవుల గురించి శనివారం ఆమె గుడిగండ్లలో స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఎవరు పిలిచినా తన కొడుకు వారి వెంబడి వెళ్లేవాడని అంది. మహ్మద్ ఆరీఫ్ మాయమాటలు చెప్పి మందుతాపి తన కొడుకును చెడగొట్టడం తోటే ఇలాంటి ఘటన జరిగిందని జయమ్మ మీడియాకు తెలిపింది. ఎవరి పిల్లలైనా పిల్లలేనని, అమ్మాయిని చంపిన కేసులో తన కొడుకు పాత్ర ఉంటే అందరికీ ఎలాంటి శిక్ష వేస్తారో వాడికి కూడా అదే శిక్ష వేయండని కరాఖండిగా తెలిపింది. తనకుమారునికి కేన్సర్ టైపు వ్యాధి ఉండటంతో ఇంకా వాటికి సంబంధించిన మందులు వాడుతున్నాడని, ఇంతలో అతను ప్రియాంకరెడ్డిని హత్యచేసినట్టు టీవీలలో వార్తలు వచ్చాయని, దాంతో ఇక తాను బతుకను ఎండ్రిన్ తాగి చస్తానని తనతో అన్నాడని తల్లి జయమ్మ తెలిపింది.
పోలీసుల కస్టడీలో నిందితుల తండ్రులు
ప్రియాంకరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితులందరూ మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామానికి చెందిన వారు కావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి పోలీసు ఏ-1 నిందితుడు మహ్మద్ ఆరీఫ్ తండ్రి హుస్సేన్, జెల్లు శివ తండ్రి రాజప్ప, చింతకుంట చెన్నకేశవులు తండ్రి కుర్లయ్యలను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ తండ్రి చనిపోవడంతో వీరు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించేందుకు తీసుకెళ్లారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న చెన్నకేశవుల తల్లి జయమ్మ