తెలంగాణ

సత్వరమే తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రియాంకారెడ్డి హత్య కేసును దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ కేసు సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను కోరారు. ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య సంఘటనలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు
చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువడిందని సీఎం గుర్తు చేశారు. అదే తరహాలో ప్రియాంకరెడ్డి కేసులో తీర్పు సత్వరం రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో కూడా ప్రియాంకారెడ్డి హత్యోందంతాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వేయవద్దని ఆదేశించారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయంటూ ప్రియాంకారెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించారు. ఇది దారుణమైన అమానుషమైన దుర్ఘటనగా సీఎం అభివర్ణించారు.
ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలు సవరించండి: కేటీఆర్ ట్వీట్
ప్రియాంకారెడ్డి ఘటనను ప్రస్తావిస్తూ ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను పునఃసమీక్షించాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ట్వీట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించాలని కోరారు. చిన్నారులు, మహిళలపై దారుణాలకు ఒడిగట్టేవారిపై పడే తీర్పులపై పునఃసమీక్షకు అవకాశం లేకుండా శిక్షలు అమలు చేయాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వీటికి అడ్డంకిగా ఉన్న చట్టాలను సవరించాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు తన ట్వీట్‌లో ప్రధానిని కోరారు. వరంగల్‌లో చిన్నారిపై అత్యాచారం చేసిన దోషికి కింద కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తగ్గించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే, నిర్భయ ఘటనలో దోషులకు ఇప్పటి వరకు శిక్ష అమలు కాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంకారెడ్డి కుటుంబానికి ఎమి హామీ ఇవ్వగలమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.