తెలంగాణ

రేపటి నుంచి ఆర్టీసీ చార్జీలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం నుంచి కాకుండా మంగళవారం నుంచి బస్సు చార్జీలు పెంచుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో కార్యక్రమం అధికారులు పాల్గొన్నందున చార్జీల పెంచే యోచన మంగళవారానికి వాయిదా వేశామన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ సమయాభావంతో పెంపు భారం మొదలు మూడో తేదీకి వాయిదా పడింది. కిలోమీటరుకు 20 పైసలు పెంచుతున్నామని స్వయంగా సీఎం ప్రకటన చేసిన విషయం తెల్సిందే. కనీసం రూ. 10 రూపాయలు టికెట్ ఉండే విధంగా అమలు చేయబోతున్నారు. చార్జీలు పెంచాలన్న అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరగే బస్సుల్లో కనీసం రూ. 10 టికెట్ ఉండబోతోంది.
ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో టికెట్లు ఎంత పెంచుతారో మంగళవారం నుంచి అమలు చేస్తారని బస్ భవన్ వర్గాలు తెలిపాయి.