తెలంగాణ

రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: టీఎస్‌ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. సమ్మె సందర్భంగా కార్మికులు చేసిన డిమాండ్ల కంటే ఎక్కువగా.. అదీ ఉహించని విధంగా అనేక తీపి కబుర్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడం, వారిని షరతులు లేకుండా విధుల్లో చేర్చుకున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ఆదివారం కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సీఎం భోజనం చేశాక ముఖాముఖిగా రెండు గంటలపాటు చర్చించి అనేక సమస్యలను పరిష్కారించడంతో పాటు మధ్య మధ్యలో పిట్టకథలతో వారిని కడుపుబ్బ నవ్వించారు.
అలాగే, తాను సమ్మె సందర్భంగా మొండిగా వ్యవహరించిన విషయాన్ని కూడా సీఎం స్వయంగా ప్రస్తావించారు. సమ్మె సందర్భంగా చనిపోయిన కార్మికుల కుటుంబంలోని ఒకరికి వారం రోజుల్లో ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతి ఉద్యోగికీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఆర్టీసీలో ఒక్కరిని కూడా ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అలాగే, ఏ ఒక్క రూటులో కూడా ప్రైవేట్‌కు అనుమతించబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లోనే ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. సమ్మెకు ముందటి నెల సెప్టెంబర్ జీతాన్ని సోమవారమే చెల్లించనున్నట్టు ప్రకటించారు. సమ్మె కాలానికి చెందిన జీతాన్ని ఏకమొత్తంగా ఒకేసారి చెల్లిస్తామన్నారు. ఇక నుంచి ఆర్టీసీలో పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 60కి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులుగా కాకుండా ఉద్యోగులుగా సంబోధించాలన్నారు. మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీ కేటాయించడంతో పాటు యూనిఫామ్ కాకుండా వారు తమ ఇష్టమైన డ్రస్ వేసుకోవచ్చని అన్నారు. పురుష ఉద్యోగులకు కూడా ఖాకీ డ్రస్ వద్దంటే రంగు మార్చుస్తామని సీఎం హామీ ఇచ్చారు. రెండేళ్లపాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఉండవని ప్రకటించారు. డిపోకు ఇద్దరి చొప్పున కార్మికులు సభ్యులుగా ఉండేలా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికుల పీఎఫ్ బకాయిలు, సీసీఎస్ డబ్బులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా 26 వరాలను సీఎం ప్రకటిస్తూ ఇక నుంచి ఆర్టీసీకి తానే బ్రాండ్ అంబాసీడర్‌గా ఉంటానని అన్నారు. ఇలా ఉండగా సీఎం తన ప్రసంగం మధ్యలో ఓ పిట్టకథ చెప్పి నవ్వించారు. ప్రతి పనిలో కొందరు చెడగొట్టేవాళ్లు ఉంటారన్నారు. రామాయణ యుద్ధంలో రామబాణం వల్ల అర్దాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటనీ రాముణ్ణి అడిగితే, కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండని అన్నారని చెప్పారు. అలా పుట్టిన వాళ్లే మనుషులను పీక్కుతింటున్నారని, వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారని పరోక్షంగా యూనియన్లను విమర్శించారు. తాను రవాణా మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలోకి ఎలా తీసుకెళ్లింది సీఎం కేసీఆర్ సవివరంగా వివరించారు.
*చిత్రం...ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటా మంతీ