తెలంగాణ

భాగ్యనగరం కాదు..బ్రాందీ నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కల్వకుంట్ల నియంతృత్వ పాలనకు చరమగీతం భువనగిరి నుండే ప్రారంభమవుతుందని, అంతర్జాతీయ చరిత్ర కలిగిన భాగ్యనగరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాందీనగరంగా మార్చివేసారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి.శ్యాంసుందర్‌రావు ఆధ్వర్యంలో నిర్మించనున్న బీజేపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి డాక్టర్ లక్ష్మణ్ విచ్చేసి భూమిపూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మట్లాడుతూ తెలంగాణ రాష్ట సాధనకోసం ప్రారంభమైన మలివిడత తెలంగాణ ఉద్యమం భువనగిరి నుండే ప్రారంభమైందని అదేవిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అంతానికి ఉద్యమం సైతం భువనగిరి నుండే ప్రారంభం కానుందని అన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులు హక్కుల సాధనకోసం 56 రోజుల సమ్మెను కేసీఆర్ ఉక్కుపాదంతొ అణగదొక్కి కార్మికుల పట్ల కర్కశంగా వ్యవరించారని అన్నారు. ఒకవైపు అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా ఉన్నా కేసీఆర్ ఆర్టీసీని ప్రయివేటుపరం చేయాలనే ఉద్దేశానికి కార్మిక యూనియన్లు అడ్డుపడుతున్నాయన్న కక్షతోనే సమ్మెను నిర్వీర్యం చేశారని అన్నారు. ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలకగానే ఉలిక్కిపడ్డ ఆయన పీఆర్‌సీ ప్రకటిస్తానని ఐఆర్ బకాయిలు విడుదల చేస్తానని ప్రలోభాలకు గురిచేసి ఆర్టీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుటిల యత్నం చేశాడని ఆరోపించారు. బీజేపీ కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా నూతన సంవత్సరాదినుంచిఉద్యమించనుందని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించిన వైనాన్ని ప్రజలకు తెలియజేసీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలకు బీజేపీ అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని లక్ష్మణ్ హామీనిచ్చారు. రాష్ట్రంలో పాలన మూడు బార్లు ఆరు వైన్స్‌లుగా కొనసాగుతోందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానమే కారణమని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బడులను మూసివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బార్లు తెరిచి మద్యం కల్చర్‌ని ప్రవేశపెట్టడంలో తలమునకలై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పబ్ కల్చర్ మహిళలపై అత్యాచారాలను ప్రేరేపించేదిలా ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారకులౌతున్నారని ఆరోపించారు. విద్యాసంస్థలను మూసి బార్లు, వైన్లు తెరిచేందుకు అనుమతించడంతో యువత పెడదారి పడ్తోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరానికి ఉన్న బ్రాండ్‌ను బ్రాందీనగర్‌గా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
పియాంకరెడ్డి హత్య
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే..
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించకుండా ప్రభుత్వానికి మాత్రమే రక్షణ కల్పిస్తుండటంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయన్నారు. ఇటీవల శంషాబాద్‌లో చోటుచేసుకున్న ప్రియాంకరెడ్డి హత్యపై ముఖ్యమంత్రి స్పందించకపోవడమే గాక మంత్రులు, పోలీసుల యంత్రాంగం అమానవీయంగా వ్యాఖ్యలు చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం తన నిరంకుశ విధానానికి స్వస్తిచెప్పి రాష్ట్భావృద్ధికి కార్యాచరణ చేపట్టాలని హితవు పలికారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి.శ్యాంసుందర్‌రావు, రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం, ప్రేమేందర్‌రెడ్డి, విజయరామారావు, పోతంశెట్టి రవీందర్, వేముల అశోక్, బండ్రు శోభారాణి, పాశం భాస్కర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు చందామహేందర్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...జిల్లా బీజేపీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తున్న లక్ష్మణ్