తెలంగాణ

మిడ్‌మానేరు నుంచి నీటి లీకేజీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 1: మిడ్‌మానేరు నుంచి వాటర్ లీకవుతోందని, నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి అవినీతికే ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అక్రమాలు బహిర్గతం చేస్తాం, జ్యుడీషియల్ విచారణకు సిద్ధమేనా? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. మిడ్‌మానేరులో లోపం లేదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్ తదితర నేతలు సవాల్ విసిరి సంధిలో పడ్డారని, ఇప్పుడు మిడ్‌మానేరు నుండి వాటర్ లీక్ అవుతోందని, సవాల్‌ను స్వీకరించేందుకు బహిరంగ చర్చకు, జ్యుడీషియల్ విచారణకు సిద్ధమేనా? అంటూ ఆదివారం మిడ్‌మానేరు లీక్ ఆధారాలతో సహా ఫొటోలను విలేఖరులకు పొన్నం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు మిడ్‌మానేరు నుండి నీళ్లే లీకవట్లేదని కొట్టి పారేసిన తెరాస నేతలు ఇప్పుడు ప్రజలకేం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. పెద్దఎత్తున స్కాంలకు పాల్పడేందుకే ఇలాంటి స్కీంలకు రూపకల్పన చేస్తున్నారని, అసలు నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా తమకెంత మొత్తంలో వస్తున్నాయో అనే వాటికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. జ్యుడీషయల్ విచారణకు సిద్ధం కావాలి అని, కట్టకు ప్రమాదం ఏర్పడకుండా, ప్రజలకు ఆస్తినష్టం సంభవించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.