తెలంగాణ

ఇతర ప్రాంతాల నుంచి మన వలస జిల్లాకొస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 1: ప్రపంచంలోనే వలసల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంతో సస్యశ్యామలంగా ఉండటమే కాక వ్యవసాయ పనులు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాకు వలసలు వస్తున్నారని, ఈ ఘనత సీఏం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టు, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో 165 జంటల సామూహిక వివాహ మహోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. సామూహిక వివాహమహోత్సవాన్ని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ్మాస్వామి దేవాలయ ఆగమ పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్‌రావుతో పాటు ప్రభుత్వ విప్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీలు పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి గత నాలుగుమార్లు సామూహిక వివాహాలు జరపడం గొప్ప విషయమని, తాను ఇలాంటి శుభకార్యానికి రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో నిర్వహించిన మూడు సామూహిక వివాహాలలో 320 జంటలకు పెళిళ్లు, ఈసారి 165 మందికి పెళ్లిళ్లు జరిపించడమంటే గొప్ప మనసు కావాలన్నారు. మనిషి దగ్గర బంగారు కడ్డీలు, కోట్ల రూపాయలు ఉన్న ప్రజల ఆశీర్వాదాలు ఎంత సంపాదించినా వృథా అవుతుందన్నారు. చివరగా ప్రజల దీవెనలు, ఆశీర్వాదాలే మనిషికి కొండంతా బలాన్ని ఇస్తాయని, ఆ బలం ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పేదల వివాహం కోసం కల్యాణ లక్ష్మీ పథకాన్ని తెచ్చి ఆదుకున్నారని అన్నారు. హిందూధర్మంలో కన్యాదానం మహాపుణ్యమని, ఆ పుణ్యం మర్రి జనార్ధన్‌రెడ్డికి దక్కిందన్నారు. కేఎల్‌ఐ ప్రాజెక్టును పూర్తి చేయడంతో ఈ ప్రాంతంలోని చెరువులన్నీ కూడా కృష్ణాజలాలతో నిండి అలుగులు పారుతున్నాయని, దారి పొడవునా ఉన్న అనేక చెరువులను చూసి ఎంతో ఆనందపడ్డానని అన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతుండటంతో వివిధ రకాల వ్యవసాయ యంత్రాల వినియోగం కూడా పెరిగిందన్నారు.
ఈ సందర్భంగా పలు అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డిని సమాజంలోని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఏదోరకంగా పేదలకు సేవ చేస్తే నూతనంగా ఏర్పడిన రాష్ట్రం బంగారు తెలంగాణగా మారనుందన్నారు. కాగా నూతన వధూవరులకు రూ.1.50 లక్షల విలువగల సామాగ్రిని కూడా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అందచేశారు.
*చిత్రం...నాగర్‌కర్నూల్‌లో జరిగిన సామూహిక వివాహామహోత్సవంలో
ప్రసంగిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు