తెలంగాణ

దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, డిసెంబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పూర్తి అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న చోట దివ్యాంగులు ఉన్నట్టయతే వారికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులు వికలత్వం కోరుకుంటే వచ్చింది కాదని జన్యుపరంగా, అనారోగ్య రీత్యా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వచ్చిందని అంతమాత్రం చేత వారు సమాజంలో ఎవరి కంటే తక్కువ కాదన్నారు. దివ్యాంగులు చాలా తెలివైన వారని వీరికి మనోధైర్యంతో పాటు మనోనిబ్బరం ఎక్కువగా ఉంటుందన్నారు. దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.3016 పింఛన్ ఇస్తున్నదని తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో స్థలం ఇస్తే దివ్యాంగుల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి దివ్యాంగులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని సమస్యల పరిష్కారానికి సావధానంగా కృషి చేయాలని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వారి సామర్థ్యాలను నిరూపించుకోవాలని సూచించారు. దివ్యాంగులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని అందువల్ల దివ్యాంగులు మనోధైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. దివ్యాంగులు బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లెందుకు బస్టాండ్‌లో మూడు చక్రాల రిక్షాలను ఏర్పాటు చేసే విషయం ఆలోచిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగుల సదరం శిబిరాల ధ్రువపత్రాలను, ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పూర్తి చేసుకున్న దివ్యాంగులకు కూడా ధ్రువపత్రాలను అందజేశారు. కొంత మంది దివ్యాంగులను శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఎంపీపీ కిచ్చారెడ్డి, డీఆర్‌డీఓ గణేష్, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర, దివ్యాంగులు బాలస్వామి, శేఖర్ తదితరులు మాట్లాడారు. ఇన్‌చార్జి జిల్లా సంక్షేమ అధికారి నర్సయ్య స్వాగతోపాన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ రేణుక, సీడీపీఓ కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సభను ప్రారంభించి, దివ్యాంగులకు సర్ట్ఫికెట్లు అందజేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి