తెలంగాణ

దక్షిణాదిపై కేంద్రం వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: పారిశ్రామిక రంగంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష కనబరుస్తోందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. పారిశ్రామీకరణ అనగానే కేంద్రానికి ఢిల్లీ, ముంబై, నాగ్‌పూర్ మాత్రమే గుర్తుకు వస్తాయి తప్ప హైదరాబాద్, చెన్నై, బెంగళూరు గుర్తుకు రాదా? అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రానికి అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి తప్ప రాజకీయ కోణంలో చూడవద్దని కేటీఆర్ హితవు పలికారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళావేదికలో బుధవారం జరిగిన తెలంగాణ స్టేట్ పారిశ్రామిక విధానం (టీఎస్-పాస్) ఐదవ వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కేంద్రం
నుంచి తెలంగాణకు ఎలాంటి సహాయ, సహకారాలు అందడం లేదని, రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో పడిపోయాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కారణాల వల్లనే తెలంగాణను పట్టించుకోవడం లేదని మంత్రి మండిపడ్డారు. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి తోడ్పాటు అందడం లేదని, ప్రోత్సహించాలనే ధోరణి కనిపించడం లేదని మంత్రి వాపోయారు. బుల్లెట్ రైలు అంటే ఢిల్లీ, ముంబయిలేనా? హైదరాబాద్ గుర్తుకు రాదా? అని మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. డిఫెన్స్ కారిడార్‌ను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మధ్య ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ దానిని ఉత్తరాదిన ఏర్పాటు చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ దేశంలోనే అత్యత్తమ పారిశ్రామిక విధానంగా మన్ననలు పొందిందన్నారు. వైట్, పింక్, గ్రీన్, బ్లూ రెవల్యూషన్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలిచిందని మంత్రి కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించిందన్నారు. అంతకుముందు కోతలు లేని విద్యుత్ సరఫరా కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కార్మికులకు జీవనాధారం అన్నారు. భారీ పరిశ్రమల వల్ల 30 శాతం ఉపాధి లభిస్తే, చిన్నా, మధ్యతరహా పరిశ్రమల వల్ల 70 శాతం ఉపాధి లభిస్తుందని మంత్రి గుర్తు చేశారు. పరిశ్రమల స్థాపన కోసం చౌకగా భూములు పొందిన కొందరు వాటిలో పరిశ్రమలు స్థాపించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని అన్నారు. పరిశ్రమల స్థాపనకు తీసుకున్న భూములను దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పరిశ్రమలకు కేటాయించిన భూములపై పున:సమీక్షిస్తామని మంత్రి హెచ్చరించారు. సులభతర వాణిజ్యంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని అన్నారు.
రక్షణ రంగంపైనా కేంద్రం చిన్నచూపు
హైదరాబాద్‌లో కొన్ని దశాబ్దాలుగా రక్షణ రంగం విస్తరించి, అభివృద్ధి చెందినప్పటికీ కేంద్రం చిన్న చూపు చూస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య అధ్వర్యంలో నిర్వహించిన 3వ డిఫెన్స్ కాన్‌క్లేవ్‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. రక్షణ రంగాల అభివృద్ధికి సంబంధించిన కొత్త సంస్థలను ఏర్పాటు చేసేటప్పుడు రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా కేంద్రం వ్యవహరించాలని మంత్రి సూచించారు. డిఫెన్స్ రంగంలో అంతర్జాతీయంగా అనేక సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం నాగ్‌పూర్, గుజరాత్ వంటి ప్రాంతాలకే ప్రాముఖ్యత ఇస్తోందని మంత్రి ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపయోగించే హెలికాప్టర్ కూడా హైదరాబాద్‌లోనే తయారు అవుతుందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
*చిత్రం... హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు