తెలంగాణ

పామాయిల్ విస్తరణను ప్రోత్సహిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పాం పంటను సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. ఆయిల్ పామ్ గెలల ధరలను నిర్ణయించే అంశంపై బుధవారం ఇక్కడ సమావేశం జరిగింది. ఒక ఎకరా వరిసాగుకు అవసరమైన నీటితో మూడు ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేయవచ్చని తెలిపారు. ప్రసుత్తం తెలంగాణలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగవుతోందని, ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగుఅవుతోందని పార్థసారథి తెలిపారు. ఈ పంట విస్తీర్ణాన్ని ఒక లక్ష ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించామన్నారు. పామాయిల్ విస్తరణ చేస్తున్నామని, కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుమతి ఇవ్వాలంటూ కేద్రాన్ని కోరామని పార్థసారథి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా పామాయిల్ పంట విస్తరణకు సహాయం అందించాలని కోరామరు. ఆయిల్ పామ్ తోటలకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పరికరాలు ఇవ్వాలని నిర్ణయించారు. తోటల్లో గెలలను కోసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న పార్థసారథి