ఆంధ్రప్రదేశ్‌

అమెరికా వెళ్లిన పాస్టర్ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జూలై 17: అమెరికా వెళ్లిన తన భర్త జాడ తెలియజేయాలని భార్య కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. గన్నవరానికి చెందిన పాస్టర్ వీరపనేని జాన్సన్ చౌదరి(44) జూన్ 4న అమెరికా వెళ్లాడు. జూలై 15న అమెరికా నుండి తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆయన ఈనాటి వరకు ఇంటికి చేరుకోలేదని అతని భార్య సుభాషిణి గన్నవరం స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జాన్సన్ చౌదరి ‘హోలీ గాడ్ మినిస్ట్రీస్ ఇండియా’ సంస్థను స్థాపించి వీరపనేనిగూడెం గ్రామంలో ఓ అనాథాశ్రమం స్థాపనకు స్థలం సేకరించాడు. ఆశ్రమ స్థాపనకు అవసరమైన నిధుల సేకరణకు జాన్సన్ చౌదరి అమెరికా వెళ్లాడు. తిరిగి వచ్చేందుకు ఈ నెల 13న అమెరికాలో బయలుదేరినట్లు, 14న ఇండియాకు వస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు.
భర్త రాక కోసం సుభాషిణి ఎయిర్‌పోర్టుకు కారు కూడా పంపారు. ఆయన ఫోన్ స్పందించక పోవటంతో సుభాషిణి ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. కాగా అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో జాన్సన్ చౌదరి ఎక్కలేదని అధికారులకు అందిన సమాచారాన్ని బట్టి తెలిసింది. జాన్సన్ చౌదరి ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో అనాథాశ్రమాలు స్థాపించినట్లు కూడా తెలుస్తోంది.