తెలంగాణ

రెండు రోజుల్లో పాలమూరు ప్రాజెక్టులకు నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: అల్మట్టి నుంచి మరో రెండు రోజుల్లో పాలమూరు ప్రాజెక్టులకు కృష్ణా జలాలు వస్తాయని, పెండింగ్ పనులన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి కృష్ణా జలాలు ఏ క్షణమైనా జూరాలకు చేరుకునే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టులపై ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ ఖరీప్ సీజన్‌లోనే కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తి పోతల ప్రాజెక్టుల నుంచి రైతులకు నీరు ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్యాకేజీల వారిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈసారి కృష్ణా జలాలతో రిజర్వాయర్లు నిండుకున్నందున ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఆటో రిక్షాలు ఇతర మార్గాల్లో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మహబూబ్‌నగర్ జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. డిస్టిబ్యూటరీలు, కెనాల్స్, ఫీల్డ్ చానల్స్‌లలో మరమ్మత్తులను పూర్తి చేయాలని కాలువలలో ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు. టార్గెట్ ప్రకారం కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయకపోతే 146 జివో ప్రకారం 60 శాతం బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. భూ సేకరణకు సంబంధించి సమస్యల పరిష్కారానికి స్థానిక ఎంఎఎల్‌ఎలు, పోలీసుల సహకారం తీసుకోవాలని మంత్రి చెప్పారు. పాలమూరు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అంశమని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులు అత్యంత వేగంగా మంజూరు చేస్తున్నటుట తెలిపారు. పనులు పూర్తి చేయడం మినహా మరో మార్గం లేదు అనే అంశాన్ని గుర్తుంచుకుని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు రాత్రింబవళ్లు పని చేసి పూర్తి చేయాల్సిందేనని హరీశ్‌రావు తెలిపారు. ఉదాసీనతను సహించేది లేదని హెచ్చరించారు. ముగింపు దశకు వచ్చిన పనులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు.