తెలంగాణ

20న రాష్ట్రపతి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 20న హైదరాబాద్ రానున్నారు. దక్షిణాది విడిదిలో భాగంగా ఆయన వస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈనెల 28 వరకు రాష్టప్రతి హైదరాబాద్‌లో ఉంటారు. సికిందరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేస్తారు. సాధారణంగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో విడిది చేసిన రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాల్లో ఏవైనా అధికారిక కార్యక్రమాలు ఉంటే వెళ్లివస్తారు. రామ్‌నాథ్ కోవింద్ కోసం రాష్ట్రపతి నిలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ నిలయంలో గతంలో ఔషధ మొక్కల వనాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో రాష్టప్రతి నిలయం అలరారుతోంది. రాష్ట్రపతి హైదరాబాద్‌లో ఉండే సమయంలో ఏర్పాట్లకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఈ నెల 16న ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. డిఫెన్స్ అధికారులతో పాటు, బందోబస్తుకు సంబంధించి పోలీసు శాఖాధికారులు, రోడ్లు, తాగునీటి వసతి, రవాణా, ప్రొటోకాల్, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షిస్తారు.
*చిత్రం... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్