తెలంగాణ

పేద పిల్లలకు ‘బాలామృతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ‘బాలామృతం’ పేరుతో ఒక పథకాన్ని రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని సంయుక్తంగా చేపడుతున్నాయి. యూనిసెఫ్ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతోంది. సమాజంలో పేద పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం ప్రస్తుం అందడం లేదని ఒక పరిశీలనలో తేలింది. అంగన్‌వాడీల్లో పిల్లకు ప్రస్తుతం అన్నం పెడుతున్నప్పటికీ, అది సరిపోవడం లేదు. అందుకే జాతీయ పోషకాహార సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్-ఎన్‌ఐఎఎన్) చాలా కాలంగా పరిశోధించి రూపొందించిన ఫార్ములా ప్రకారం బూస్ట్, హార్లిక్స్ తరహాలో పోషకాహారాన్ని ప్రత్యేకంగా తయారు చేసింది. వాణిజ్యపరంగా తయారు చేసే బాధ్యతను తెలంగాణ ఫుడ్స్ సంస్థకు అప్పగించారు. రాష్ట్రంలోని పేద పిల్లలందికీ, సరిపోయే విధంగా పోషకాహారాన్ని తయారు చేసే బాధ్యతను తెలంగాణ ఫుడ్స్ సంస్థకు అప్పగించారు. పేద పిల్లలకు వారి తల్లిదండ్రులు అందించే ఆహారానికి అదనంగా ఈ పోషకాహారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లలకోసం ప్రత్యేకంగా తయారు చేయడంతో ‘బాలామృతం’ అని దీనికి పేరు పెట్టారు. ఈ నెల 16 న బాలామృతం పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం. జగదీశ్వర్ తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, స్ర్తి,శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. పేదపిల్లలకు ఇక నుండి అవసరమైన పౌష్టికాహారం లభిస్తుందని వివరించారు.